తెలంగాణ మళ్లీ కరోనా కేసులు పెరిగాయి.. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 987 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. మరో ఏడుగురు కరోనా బాధితులు మృతిచెందారు.. ఇదే సమయంలో 1,362 మంది కోవిడ్ బాధితులు కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది ప్రభుత్వం.. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,22,593కు చేరుకోగా.. రికవరీ కేసులు 6,05,455కు పెరిగాయి… ఇప్పటి వరకు కోవిడ్‌తో 3,651 మంది మృతిచెందారు.. కరోనా పాజిటివిటీ రేటు 0.58 శాతానికి పడిపోగా.. రికవరీ రేటు 97.24గా ఉంది.. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 13,487 యాక్టివ్ కేసులు ఉన్నాయి.. గత 24 గంటల్లో 1,21,236 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్.. తాజా కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 130 కేసులు, ఖమ్మంలో 102 కేసులు నమోదు అయ్యాయి.
తెలంగాణ కోవిడ్ అప్‌డేట్.. ఈరోజు ఎన్ని కేసులంటే..?

COVID