Site icon NTV Telugu

Covid 19: తెలంగాణలో భారీగా కొత్త కేసులు

Covid

Covid

తెలంగాణలో మరోసారి భారీగా వెలుగు చూస్తున్నాయి కరోనా పాజిటివ్‌ కేసులు.. రోజువారి కరోనా కేసుల మీటర్‌ క్రమంగా పైకి కదులుతోంది.. నిన్నే 400 మార్క్‌ను క్రాస్‌ చేయగా.. ఇవాళ ఏకంగా 434 కేసులు నమోదు అయ్యాయి.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 27,754 శాంపిల్స్‌ పరీక్షించగా.. 434 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 129 మంది కోవిడ్‌ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 2,680 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ అధికారులు పేర్కొన్నారు.. అయితే, కేవలం జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 292 కొత్త కేసులు వెలుగు చూడడం ఆందోళన కలిగిస్తోంది..

Exit mobile version