తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా దిగివస్తున్నాయి.. మృతుల సంఖ్య కూడా తగ్గుతూ వస్తోంది.. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో కొత్తగా 2,493 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 15 మంది ప్రాణాలు వదిలారు.. ఇదే సమయంలో.. 3,308 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో.. రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5,80,844కు పెరిగాయి. 5,44,294 మంది రికవరీ అయ్యారు.. ప్రస్తుతం 33,254 యాక్టివ్ కేసులు ఉండగా.. ఇప్పటి వరకు కోవిడ్‌తో మృతిచెందినవారి సంఖ్య 3,296కి పెరిగింది..
తెలంగాణ కరోనా అప్‌డేట్.. ఇవాళ ఎన్నికేసులంటే..?
Covid 19