NTV Telugu Site icon

తెలంగాణ కోవిడ్‌ అప్‌డేట్‌.. ఇవాళ ఎన్నికేసులంటే..?

covid 19

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా దిగివస్తున్నాయి… రాష్ట్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రంలో 729 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా… మరో ఆరుగురు కోవిడ్‌ బాధితులు మృతిచెందారు… ఇక, ఇదే సమయంలో 987 కోవిడ్‌ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో.. కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 6,30,514కు చేరుకోగా.. ఇప్పటి వరకు కోలుకున్న కోవిడ్‌ బాధితుల సంఖ్య 6,15,852కు పెరిగాయి… మృతుల సంఖ్య 987కు చేరింది.. ప్రస్తుతం రాష్ట్రంలో 10,942 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని.. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 1,06,045 సాంపిల్స్‌ పరీక్షించినట్టు ప్రభుత్వం బులెటిన్‌లో పేర్కొంది.. రాష్ట్రంలో రికవరీ రేటు 97.67కు చేరింది.. తాజా కేసుల్లో జీహెచ్‌ఎంసీ, ఖమ్మం జిల్లాలో అత్యధికంగా 72 చొప్పున పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి.