తెలంగాణ కరోనా అప్‌డేట్‌

COVID

COVID

కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య తెలంగాణలో క్రమంగా తగ్గుతూ వస్తోంది.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో 1,14,105 శాంపిల్స్‌ పరీక్షించగా.. 638 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది.. మరో ముగ్గురు కోవిడ్‌ బాధితులు చనిపోయారు.. ఇదే మయంలో.. 715 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో.. రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 6,41,791కి పెరగగా.. రికవరీ కేసులు 6,28,679కు చేరాయి.. ఇక, ఇప్పటి వరకు కోవిడ్‌ బారినపడి 3,787 మంది మృతిచెందగా.. ప్రస్తుతం 9,325 యాక్టివ్‌ కేసులు ఉన్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్.