Site icon NTV Telugu

తెలంగాణ‌లోనూ స్వ‌ల్పంగా త‌గ్గిన కోవిడ్ కేసులు

క‌రోనా రోజువారి కేసులు మ‌ళ్లీ త‌గ్గుతున్నాయి.. తెలుగు రాష్ట్రాల్లోనూ కేసులు త‌గ్గుముఖం ప‌ట్టాయి.. రాష్ట్రవైద్య ఆరోగ్య‌శాఖ విడుద‌ల చేసిన తాజా బులెటిన్ ప్ర‌కారం.. తెలంగాణ వ్యాప్తంగా గ‌త 24 గంట‌ల్లో 3,590 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి.. మ‌రో ఇద్ద‌రు కోవిడ్ బాధితులు ప్రాణాలు విడిచారు.. మ‌రోవైపు.. ఇదే స‌మ‌యంలో 3,555 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో.. మొత్తం కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 7,58,566కు చేర‌గా.. రిక‌వ‌రీ కేసులు 7,14,034కు పెరిగాయి.. మృతుల సంఖ్య 4,085కు పెరిగింది.. ప్ర‌స్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 40,447గా ఉన్నాయ‌ని.. రివ‌క‌రీ రేటు 94.13 శాతానికి చేరింద‌ని బులెటిన్‌లో పేర్కొంది స‌ర్కార్.. ఇక‌, గ‌త 24 గంట‌ల్లో రాష్ట్రవ్యాప్తంగా 95,355 శాంపిల్స్ ప‌రీక్షించ‌గా.. మ‌రో 3,960 శాంపిల్స్ రిపోర్టులు రావాల్సి ఉంది.

Read Also: వైసీపీ ఎమ్మెల్యేకు త‌ప్పిన ప్ర‌మాదం

Exit mobile version