Site icon NTV Telugu

Corona Bullietin : తెలంగాణలో భారీగా నమోదైన కరోనా కేసులు..

Corona

Corona

యావత్తు ప్రపంచ దేశాల్లో అల్లకల్లోలం సృష్టించిన కరోనా రక్కసి మరోసారి రెక్కలు చాస్తోంది. కరోనా పుట్టినిల్లు చైనాలో ఇటీవల కరోనా కేసులు భారీగా నమోదవడంతో అక్కడ కఠిన లాక్‌ డౌన్‌ నిబంధనలు అమలు చేయడంతో కరోనా కేసులు అదుపులోకి వచ్చాయి. అయితే ఇప్పుడు భారత్‌తో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా తెలంగాణలో మరో సారి రెండు వందలకు పైగా కరోనా కేసులు నమోదవడ కలవరపెతుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 28,424 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 285 మందికి పాజిటివ్‌గా నిర్థారణైంది.

అంతేకాకుండా ఒక్క రోజులో 65 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అయితే గడిచిన 24 గంటల్లో ఎలాంటి మరణాలు సంభవించలేదు. ఇప్పటివరకు మొత్తం 7,95,293 మందికి కరోనా సోకగా.. అందులో 7,89,561 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అలాగే ఇప్పటివరకు కరోనాతో 4,111మంది మరణించారు. ఇదిలా ఉంటే.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఫోర్త్‌ వేవ్‌ వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించాయి.

Exit mobile version