తెలంగాణలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 3557 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో ముగ్గురు మృతి చెందినట్టు తెలంగాణ ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో 24,253 యాక్టీవ్ కేసులు ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 1474 కరోనా కేసులు నమోదయ్యాయి. భాగ్యనరగంలో కేసులు పెరిగిపోతుండటంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. కరోనా అనుమానాలు ఉన్న వ్యక్తులు తప్పనిసరిగా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. వైద్యారోగ్య సర్వే ప్రకారం తెలంగాణలో సుమారు 20 లక్షల మందికి కరోనా అనుమానిత లక్షణాలు ఉన్నాయని, హైదరాబాద్ నగరంలో 15 లక్షల మందికి కరోనా అనుమానిత లక్షణాలు ఉన్నట్టు వైద్యారోగ్యశాఖ సర్వే నివేదిక తెలియజేసింది.
Read: ఆ ఇంట్లో ఎవరు నివశించినా వారికి దురదృష్టమే… అదృష్టం ఏంటంటే…
