Congress Cabinet: తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు మార్పు కావాలి-కాంగ్రెస్ రావాలి అంటూ హస్తం రావాలి అనే హస్తం పార్టీ నినాదాన్ని నిజం చేశారు. 119 సీట్లలో 64 సీట్లు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చి అధికారాన్ని ఖాయం చేసుకుంది. కానీ.. మంత్రివర్గ కూర్పే ఇప్పుడు ఆ పార్టీ ముందు ఉన్న అతిపెద్ద ఛాలెంజ్. ప్రభుత్వ అవసరాలకు తగినట్టు… ముఖ్యమంత్రిని కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేసుకుంటుంది. అది పార్టీ అంతర్గత వ్యవహారం. కానీ మంత్రి వర్గ కూర్పు నల్లేరు మీద నడక కాదు. పల్లేరు కాయలపై పరుగు లాంటింది. దీనికి కారణం ఏంటంటే చాలా మంది పార్టీలో సీనియర్ నేతలు ఉన్నారు. భట్టి, ఉత్తంకుమార్‌రెడ్డి, ఆయన భార్య పద్మావతి, కోమటిరెడ్డి బ్రదర్స్, వివేక్ బ్రదర్స్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా లిస్ట్ ఉంది. రకరకాల సమీకరణాల్ని బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది. జిల్లాలవారీగా చూడాలి. సీనియారిటీ చూడాలి. కుల సమీకరణాలు చూసుకోవాలి.. పార్టీకి వాళ్లు చేసిన సేవ… లాయల్టీ కూడా చూడాలి. ఖమ్మం జిల్లాకు వస్తే.. కమ్మ సామాజిక వర్గానికి చెందిన తుమ్మలకు సముచిత స్థానం ఇవ్వాలి. 40 రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు తుమ్మల.
Read also: Lowest Victory Margin: 16 ఓట్ల తేడాతో ఓడిన కాంగ్రెస్ అభ్యర్థి!
తర్వాత పొంగులేటి..! ఆయనకు కూడా హై ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. ఇక భట్టి… ఆయన సీఎల్పీ నేత. ఆయనకు కూడా ఏదో ఒక టాప్ సీట్ కేటాయించాల్సిందే..! ఉత్తమ్, పద్మావతి… ఇద్దరు సీనియర్లు, అనుభవజ్ఞులు. నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి బ్రదర్స్ కూడా సీనియర్ నేతలు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి గతంలో మంత్రిగా పనిచేశారు. వీళ్లకు కూడా ఏదో ఒక సముచిత శాఖలు ఇవ్వాల్సిందే..! ఉత్తం, తుమ్మలకు మంత్రులుగా పనిచేసిన అనుభవం ఉంది. వాళ్లందరికీ చోటు కల్పించాలి. వరంగల్‌లో సీతక్క, కొండా సురేఖ లాంటి సీనియర్లు ఉన్నారు. వాళ్లకు కూడా మంత్రి పదవులు ఇవ్వాలి. ఆదిలాబాద్‌లో ప్రేమ్ సాగర్ రావు ఉన్నారు. ఆయన పార్టీకి స్టార్ క్యాంపెయినర్‌లలో ఒకరు. లాయల్‌గా పార్టీని నమ్ముకుని ఉన్నారు. మంథని నుంచి గెలిచిన శ్రీధర్ బాబు కూడా సినీయరే..! మెదక్ జిల్లాలో దామోదర రాజనర్సింహ గతంలో డిప్యూటీ సీఎంగా కూడా పనిచేశారు. నిజామాబాద్ జిల్లాలో సుదర్శన్ రెడ్డి, షబ్బీర్ అలీ ఉన్నారు. మహబూబ్‌నగర్‌లో గతంలో మంత్రిగా పనిచేసిన జూపల్లి కాంగ్రెస్‌లో చేరి గెలిచారు. వీళ్లందరికీ తగిన శాఖలు కేటాయించడం కత్తి మీద సామే..! వీళ్లందరికీ అధిష్టానం ఎలా చోటు కల్పిస్తుందన్నది
వేచి చూడాలి.
PM Modi: పార్లమెంట్‌లో ఓటమి కోపాన్ని వెళ్లగక్కకండి… విపక్షాలపై ప్రధాని మోడీ నిప్పులు