BM Sandeep : తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త వ్యూహం.. రెండేళ్ల టార్గెట్ ఫిక్స్

  • కాంగ్రెస్ బలోపేతంపై సందీప్ ఫోకస్
  • నేతలతో వరుసగా వన్ టు వన్ భేటీలు
  • వచ్చే ఎన్నికల్లో మరిన్ని సీట్లే లక్ష్యం
  • బీఆర్ఎస్, బీజేపీలపై ఐక్య పోరాటం
Bm Sandeep

Bm Sandeep

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం సంస్థాగతంగా సమర్థంగా పనిచేస్తున్నాయని ఏఐసీసీ ఇంచార్జి బీఎం సందీప్ స్పష్టం చేశారు. నిన్నటి నుంచి రాష్ట్రంలో అందరినీ కలుస్తూ, వన్-టు-వన్ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితులను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. మీనాక్షి చాలా కాలం పాటు ఇక్కడ పనిచేశారని ప్రస్తావిస్తూ, రాబోయే రెండేళ్లలో పార్టీని మరింత బలోపేతం చేసి ఎన్నికల్లో ప్రస్తుత సీట్ల కంటే ఎక్కువ సంఖ్యలో గెలిపించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు చెప్పారు.

వరుస సమావేశాలు.. వన్-టు-వన్ చర్చలు

నిన్న ఉదయం పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం జరిగిందని, ఆ తర్వాత స్ట్రాటజీ కమిటీ భేటీ అయిందని బీఎం సందీప్ వివరించారు. అనంతరం తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ విస్తృత కార్యవర్గ సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రితో పాటు పార్టీలోని అన్ని ఫ్రంటల్ డిపార్ట్‌మెంట్ సెల్స్ హెడ్‌లు, డీసీసీ అధ్యక్షులతో వన్-టు-వన్ చర్చలు జరిగాయని చెప్పారు. అలాగే ఉదయం మంత్రులందరితోనూ విడివిడిగా మాట్లాడినట్లు వెల్లడించారు.

సంక్షేమ పథకాలపై ఆదరణ.. ఐక్యంగా పోరాటం

తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు కాంగ్రెస్ సంక్షేమ పథకాలను సాదరంగా ఆహ్వానించారని, అందరూ సంతోషంగా ఉన్నారని సందీప్ పేర్కొన్నారు. పార్టీ నాయకులందరూ సానుకూలంగా, ఐక్యంగా ఉన్నారని తెలిపారు. రాబోయే రెండేళ్లలో సంస్థాగతంగా పార్టీని మరింత బలోపేతం చేసే అంశంపై సుదీర్ఘంగా చర్చించామని, అవినీతి బీఆర్ఎస్‌పైనా, విభజన శక్తులైన బీజేపీ–ఆర్ఎస్ఎస్‌లపైనా ఐక్యంగా, సంఘటితంగా బలంగా పోరాడుతున్నామని స్పష్టం చేశారు.