Site icon NTV Telugu

CM Revanth Reddy With Chiranjeevi: చిరంజీవి విందులో సీఎం రేవంత్ రెడ్డి.. ఫోటోలు వైర‌ల్‌..!

1

1

CM Revanth Reddy With Chiranjeevi: టాలీవుడ్ ఇండస్ట్రీ గర్వించదగ్గ నటులలో చిరంజీవి ఒకరు. చిరు సినీ జీవితం ఇంతింతై వటుడింతయై అన్నట్లుగా సుప్రీమ్ హీరో నుంచి మెగాస్టార్ స్థాయికి ఎదిగాడు. తన నటన, డ్యాన్స్‌తో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు. మెగాస్టార్ కృషితో నాస్తి దుర్భిక్షం అనే పదానికి నిలవెత్తు నిదర్శనంగా నిలిచారు. సినీ కళామతల్లికి ఆయన చేసిన సేవలకు తగిన గుర్తింపు లభించింది. కేంద్ర ప్రభుత్వం ఆయనను దేశ రెండో పౌర పురస్కారం పద్మవిభూషణ్‌తో సత్కరించింది. ఐదు దశాబ్దాలకు పైగా కళారంగానికి చేసిన సేవలకు గాను మెగాస్టార్ చిరంజీవి ఈ అవార్డును అందుకున్నారు. ఆయన పద్మవిభూషణ్ అందుకున్నప్పుడు, ప్రతి తెలుగువాడి హృదయాలు ఆనందంతో ఉప్పొంగిపోయాయి. చిరు ఈ అవార్డును అందుకున్న సందర్భంగా సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు స్వయంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. గణతంత్ర దినోత్సవం 2024 సందర్భంగా, మెగాస్టార్ చిరంజీవిని భారత ప్రభుత్వం పద్మ విభూషణ్‌తో సత్కరించింది. ఆ తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమలో, అభిమానుల్లో సంబరాలు అంబరాన్నంటాయి.

చిరంజీవి తనయుడు రామ్‌చరణ్‌, అల్లు అర్జున్‌తో పాటు పలువురు నటీనటులు సోషల్‌మీడియాలో పోస్ట్‌లు చేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ అద్భుతమైన విజయాన్ని పురస్కరించుకుని ఉపాసన, రామ్ చరణ్ మెగా ఫ్యామిలీతో కలిసి చిరంజీవి డిన్నర్ పార్టీ ఏర్పాటు చేశారు. దీనికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా హాజరయ్యారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రామ్ చరణ్, ఆయన భార్య ఉపాసన ప్రత్యేక స్వాగతం పలికారు. ప్రముఖ సినీ నటుడు చిరంజీవికి కేంద్రం పద్మవిభూషణ్ అవార్డు ప్రకటించడంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేస్తూ.. చిరంజీవికి శుభాకాంక్షలు తెలిపారు.

అవార్డు ప్రకటన సందర్భంగా హైదరాబాద్‌లో చిరంజీవి ఏర్పాటు చేసిన విందులో సీఎం మాట్లాడుతూ.. చిరంజీవి అవార్డు తెలుగు వారందరికీ గర్వకారణమని అన్నారు. మరికొంత కాలం అభిమానులను అలరించాలని రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. కాగా.. చిరంజీవి, రామ్‌చరణ్‌లు నిర్వహిస్తున్న పార్టీలోకి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎంట్రీపై సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ డిన్నర్ పార్టీకి తెలంగాణ సీఎం స్వయంగా వచ్చి చిరంజీవికి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ వేడుకలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, కల్వకుంట్ల కవిత, కిషన్‌రెడ్డి, బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఆయన సతీమణి సంగీతారెడ్డి, ఉపాసన తల్లిదండ్రులు, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, నిర్మాత దిల్ రాజుతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. చిరంజీవికి పద్మవిభూషణ్ రావడం రాష్ట్రమంతా గర్వించదగ్గ విషయమని ముఖ్యమంత్రి ప్రశంసించారు.
Special Sanitation Drive: పల్లెల్లో ‘స్పెషల్ శానిటేషన్ డ్రైవ్’.. ఫిబ్రవరి 7 నుంచి 15 వరకు..

Exit mobile version