CM Revanth Reddy: తెలుగు రాష్ట్రాల మధ్య సత్సంభదాలతో అభివృద్ది పథంలో నడవాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఏపిలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత కలసి ముందుకు సాగుతామన్నారు. తిరుమలలో తెలంగాణ ప్రభుత్వం తరపున కళ్యాణ మండపం నిర్మించాలని భావిస్తున్నామన్నారు. నూతన ప్రభుత్వం ఏర్పడిన తరువాత ప్రకియను ప్రారంభిస్తామన్నారు. ఫలితాల ప్రక్రియ ముగిసిన తరువాత తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరుపున సత్ర నిర్మాణానికి అవకాశం ఉంటే కళ్యాణ మండపం నిర్మించి స్వామి వారి సేవ కొనసాగిస్తామని రాష్ట్ర ప్రభుత్వం తరుపున కోరుకుంటున్నా అన్నారు.
Read also: Jharkhand Land Scam Case: హేమంత్ సోరెన్ మధ్యంతర బెయిల్ పిటిషన్.. నేడు సుప్రీంకోర్టులో విచారణ
తొందరలోనే ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిని కలిసి విజ్ఞప్తి చేసి స్వామి వారి సేవలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా భాగస్వామ్యం అయ్యే విధంగా చూస్తామన్నారు. రాజకీయాలపై రేవంత్ రెడ్డి స్పందిస్తూ.. తిరుపతి కొండపై రాజకీయాలు మాట్లాడకూడదని అన్నారు. తప్పకుండా మంచి వాతావరణం ఉందన్నారు. వాతావరణ మంచిగా అనుకూలించిందన్నారు. గత సంవత్సరం కరువు వచ్చినా.. తాగు నీటి సమస్యలు ఉన్నా సమస్యలను అధిగమించి మంచి బుతుపవనాలు మంచి కాలం ఉందన్నారు. వానలు పడాలి, పంటలు పండాలన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలనేదే మా ఆలోచన అన్నారు. ప్రధాన ఆలోచన కూడా రైతాంగాన్ని ఆదుకోవడం, దేశం యొక్క సంపదను పెంచాలనేదే అన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఇవాళ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. టీటీడీ ఈవో ఎవి ధర్మారెడ్డి వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఉదయం రేవంత్ రెడ్డి తన మనవడు శ్రీనుకి తలనీలాలు చెల్లించుకున్న విషయం తెలిసిందే..
RR vs RCB Eliminator 2024: ఆర్‌సీబీనే ఆధిపత్యం చెలాయిస్తుంది.. ఆర్‌ఆర్ మ్యాజిక్‌నే చేస్తేనే..!