Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Telangana Cm Revanth Reddy Special Review On Electricity Today

Revanth Reddy: నేడు సమీక్షకు సీఎండీని పిలవండి.. రూ.85 వేల కోట్లు బకాయిలపై చర్చ

Published Date :December 8, 2023 , 7:20 am
By Bhanu
Revanth Reddy: నేడు సమీక్షకు సీఎండీని పిలవండి.. రూ.85 వేల కోట్లు బకాయిలపై చర్చ
  • Follow Us :
  • google news
  • dailyhunt

Revanth Reddy: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుతీరింది.. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి, మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత తొలి కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముందుగా విద్యుత్ శాఖపై ముఖ్యమంత్రి సమీక్షించారు. రాష్ట్రంలో విద్యుత్ వ్యవస్థ పనితీరుపై చర్చ జరిగి.. విద్యుత్ శాఖలో ఏం జరిగిందో వివరిస్తూ సమగ్ర శ్వేతపత్రం విడుదల చేయాలని మంత్రివర్గం అభిప్రాయపడింది. ఇంతకాలం ఆ శాఖలో నిజానిజాలు బయటపెట్టడం లేదంటూ ఆ శాఖ ఉన్నతాధికారులపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. విద్యుత్ సంక్షోభం తెచ్చేందుకు కుట్ర పన్నారని సీఎం రేవంత్ అభిప్రాయపడినట్లు సమాచారం. విద్యుత్ సంస్థలకు ఇప్పటి వరకు రూ.85 వేల కోట్లు బకాయిలు ఉన్నాయని అధికారులు సీఎంకు చెప్పినట్లు తెలుస్తోంది. దీనిపై నేడు సమీక్షిస్తానని చెప్పి ఆ శాఖకు సంబంధించిన పూర్తి వివరాలతో సిద్ధం కావాలని రేవంత్ ఆదేశించినట్లు సమాచారం. ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకరరావు ఇటీవల ఉద్యోగానికి రాజీనామా చేశారని.. దానిని ఆమోదించకుండా ఇవాళ (శుక్రవారం) సమీక్ష సమావేశానికి పిలవాలని సీఎం ఆదేశించారు. విద్యుత్ శాఖపై ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక సమీక్ష నిర్వహించనున్నారు.

Read also: Congress : తెలంగాణ ప్రభుత్వ బడ్జెట్‌పై కాంగ్రెస్ ‘గ్యారెంటీలు’ ఎంత భారంగా మారనున్నాయి?

కేబినెట్ భేటీలో ఆరు హామీల చట్టంపై సుదీర్ఘ చర్చ జరిగిందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. తెలంగాణ ప్రజలకు మంత్రివర్గం కృతజ్ఞతలు తెలిపిందని.. 2014 నుంచి 2023 వరకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై డిసెంబర్ 7న అన్ని శాఖల వివరాలపై చర్చ జరిగిందని తెలిపారు. 2014 నుంచి డిసెంబర్ 2023 వరకు అన్ని శాఖల నిధుల ఖర్చుపై శ్వేతపత్రం విడుదల చేయాలని అధికారులను కోరారు.ఆరు హామీల్లో రెండు హామీలను అమలు చేయాలని నిర్ణయించారు. సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా రెండు హామీల అమలుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రైతులకు, పరిశ్రమలకు 24 గంటల కరెంటు ఇవ్వాలని మంత్రివర్గంలో నిర్ణయించారు. 2014 నుంచి గత ప్రభుత్వం కరెంటులో అనేక తప్పులు, సమస్యలు, ప్రణాళిక లేకుండా ఆలోచించిందని.. నేడు విద్యుత్‌పై సీఎం సమీక్షిస్తారని చెప్పారు. ప్రజలకు అంతరాయం లేకుండా నిరంతరాయంగా విద్యుత్ అందించాలని కేబినెట్ ఆమోదించిందని తెలిపారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌కు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని తెలిపారు. 9వ తేదీన కొత్త ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారోత్సవం ఉంటుందన్నారు.

Read also: Astrology: డిసెంబర్ 08, శుక్రవారం దినఫలాలు

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Chife minister Revanth reddy
  • CM Revanth Reddy
  • revanth reddy
  • telangana cabinet meet
  • telangana cm revanth reddy

తాజావార్తలు

  • Israel-Iran War: ఇరాన్‌కు మరో గట్టి ఎదురుదెబ్బ.. ఐఆర్‌జీసీ ఇంటెలిజెన్స్ చీఫ్ హతం

  • Actress Subhashini Suicide: భర్త వీడియో కాల్.. ఆత్మహత్య చేసుకున్న నటి సుభాషిణి..

  • Taramati Drug Case: తారామతి రిసార్ట్ డ్రగ్స్ కేస్ లో కీలక విషయాలు.. డీజే జాసన్ కు డ్రగ్స్ పాజిటివ్

  • Trisha Vijay: త్రిష ఇన్‌స్టా పోస్ట్ వైరల్.. విజయ్‌తో పెళ్లి వార్తలకు చెక్ పెట్టినట్టేనా?

  • Dilraju: అనిల్ రావిపూడి హీరోగా దిల్ రాజు మాస్టర్ ప్లాన్.. త్వరలోనే నటుడిగా ఎంట్రీ!

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions