తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్ రావు ఇవాళ మహారాష్ట్రలోని కొల్హాపూర్‌కు వెళ్లనున్నారు.. కుటుంబ సభ్యులతో కలిసి కొల్హాపూర్ వెళ్తున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్.. ఉదయం 10.30 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో కేసీఆర్ ఫ్యామిలీ బయల్దేరనుంది.. ఇక, కుటుంబసభ్యులతో కలిసి కొల్హాపూర్‌లోని మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకోనున్నారు.. మహలక్ష్మీ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయనున్నారు సీఎం కేసీఆర్.. ఆ తర్వాత సాయంత్రం తిరిగి హైదరాబాద్ చేరుకోనున్నారు.. కాగా, ఇప్పటికే దేశంలోని పలు పుణ్యక్షేత్రాలను సందర్శించారు కేసీఆర్… దేశంలోని శక్తి పీఠాలలో ఒకటైన మహలక్ష్మీ అమ్మవారిని ఇవాళ దర్శించుకోనున్నారు కేసీఆర్ దంపతులు..
Read Also: West Bengal: దీదీ కోటలో మళ్లీ హింస.. రాష్ట్రపతి పాలన ఒక్కటే మార్గం..!
