Site icon NTV Telugu

KCR: కొల్హాపూర్‌లో కేసీఆర్‌ దంపతులు.. శ్రీ మహాలక్ష్మీకి ప్రత్యేక పూజలు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కొల్హాపూర్‌లోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం ప్రత్యేక విమానంలో బేగంపేట్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయల్దేరి వెళ్లిన కేసీఆర్‌ దంపతులు, కుటుంబ సభ్యులు.. మహారాష్ట్రలోని కొల్హాపూర్‌ చేరుకున్నారు.. ఆ తర్వాత దేశంలోని శక్తి పీఠాల్లో ఒకటైన.. అష్టాదశ శక్తి పీఠాలలో ఏడవ శక్తిపీఠమైన కొల్హాపూర్‌ శ్రీ మహాలక్ష్మీ అంబాబాయి అమ్మవారిని దర్శించుకున్నారు.. ప్రత్యేక పూజలు చేశారు కేసీఆర్‌ దంపతులు. అంతకుముందు కుటుంబ సమేతంగా ఆలయానికి చేరుకున్న సీఎం కేసీఆర్‌ దంపతులకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.. దర్శనానంతరం సీఎం కేసీఆర్‌ దంపతులకు ఆశీర్వచనం అందించారు. ఇక, కొల్హాపూర్‌ నుంచి తిరుగు ప్రయాణం కానున్న కేసీఆర్.. ఇవాళ సాయంత్రం హైదరాబాద్‌ చేరుకోనున్నారు..

Read Also: Hijab row: హిజాబ్‌పై విచారణకు సుప్రీం నిరాకరణ.. సంచలనం చేయొద్దు..

Exit mobile version