CM KCR Tour Haryana: స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ ఉపప్రధాని చౌధరి దేవీలాల్ 108వ జయంతి సందర్భంగా ఈనెల 25న హరియాణాలో జరిగే సమ్మాన్ దివస్లో CM KCR పాల్గొననున్నారు. మాజీ CM ఓంప్రకాశ్ చౌతాలా ఆహ్వానం పంపినట్లు TRS వర్గాలు చెబుతున్నాయి. ఈ కార్యక్రమానికి పలు రాష్ట్రాల CMలు, ముఖ్యనేతలు హాజరవుతున్నారు. జాతీయ పార్టీ ఏర్పాటు సన్నాహాల్లో ఉన్న KCR.. ఇటీవల నితీశ్, తేజస్వీ, కుమారస్వామి, శంకర్సిస్ట్లతో భేటీ అయిన విషయం తెలిసిందే.
ఇక కాంగ్రెస్ మినహా దేశంలోని వివిధ విపక్ష రాజకీయ పార్టీలకు చెందిన ముఖ్యమంత్రులు.. ఇతర ముఖ్య నేతలు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. ఈనేపథ్యంలో.. బిహార్ సీఎం నితీశ్ కుమార్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీతోపాటు కేసీఆర్ ఆహ్వానితుల జాబితాలో ఉన్నారు. దీంతో.. ఫతేబాద్ లో నిర్వహించే ఈ కార్యక్రమం విపక్షాల ఐక్యతను చాటేందుకు వేదికగా నిలుస్తుందని టీఆర్‌ఎస్ వర్గాలు వెల్లడించాయి. కాగా.. జాతీయ పార్టీ స్థాపన కోసం సన్నాహాలు చేస్తున్న కేసీ ఆర్, జాతీయ స్థాయిలో కాంగ్రెస్, బీజేపీయే తర పార్టీలతో సత్సంబంధాలు కొనసాగించే యోచనలో ఉన్నట్లు.. హరియాణాలో జరిగే దేవీలాల్ జయంతి వేడుకలకు హాజరు కావాలని నిర్ణయించుకున్నారు. తాజాగా బిహార్ సీఎం నితీశ్, డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌తో సమావేశమైన కేసీఆర్, కర్ణాటక మాజీ సీఎం, జెడీఎస్ అధినేత కుమారస్వామి, గుజరాత్ మాజీ సీఎం శంకర్‌సిన్హ్ వాఘేలాతోనూ భేటీ అయ్యారు. ఇక హరియాణా పర్యటనలో భాగంగా అక్కడి రైతు, దళిత సంఘాల ప్రతినిధులతోనూ కేసీఆర్ భేటీ అయ్యే అవకాశముంది. ఈనేపథ్యంలో.. సీఎం పర్యటనకు సంబంధించి ఒకట్రెండు రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడుతుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
