CM KCR: తెలంగాణలో పరిస్థితి తారుమారు అయ్యింది.. మోసపోతే గోసపడతాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana CM KCR Speech In Sangareddy Public Meeting: ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఒక ఎకరా అమ్మితే తెలంగాణలో 10 ఎకరాలు కొనుక్కునే పరిస్థితి ఉండేదని చంద్రబాబు చెప్పారని.. ఇప్పుడు పరిస్థితి తారుమారు అయ్యిందని అయనే అన్నాడని.. అంతలా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందిందని సీఎం కేసీఆర్ అన్నారు. సంగారెడ్డిలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. మూడు రోజుల పాటు గల్లీగల్లీలో తిరిగి సమస్యలు తెలుసుకున్నానని, పటాన్‌చెరు వరకు మెట్రో కావాలని అడిగారని చెప్పారు. రాష్టం ఏర్పడినప్పుడు ఎన్నో అపోహలు సృష్టించారని.. కానీ ఇప్పుడు 24 గంటలు కరెంట్ ఇచ్చే ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ, ఇంటింటికి మంచి నీళ్ళు ఇచ్చే ఏకైక రాష్టం కూడా తెలంగాణనే అని ఉద్ఘాటించారు.
Manchu Manoj: మంచు మనోజ్ భార్యను ఇలాంటి పోజ్ లో ఎప్పుడైనా చూశారా..?
Also Read
అత్యదిక ట్రాఫిక్ ఉండే ప్రాంతం పటాన్ చెరు నుంచి హయత్ నగర్ అని పేర్కొన్న ఆయన.. మరోసారి తమని గెలిపిస్తే పటాన్‌చెరు వరకు మెట్రో వేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. తాము చెప్పింది చేస్తామని, ఎట్టి పరిస్థితుల్లోనూ మాట తప్పమని బల్లగుద్ది చెప్పారు. మూడు మున్సిపాలిటీలకు 30 కోట్లు, 55 గ్రామ పంచాయితీలకు రూ.15 లక్షలు నిధులు ఇస్తామన్నారు. పటాన్‌చెరును రెవెన్యూ డివిజన్ చేస్తామని మాటిచ్చారు. తెలంగాణలో మనం కడుతున్న డబుల్ బెడ్రూంలు దేశంలోనే ఎక్కడా లేవన్నారు. మోసపోతే మనం గోసపడతామని హెచ్చరించారు. హరీశ్ రావు వచ్చాక వైద్య రంగం పరుగులు పెడుతోందన్నారు. గతంలో హైదరాబాద్‌లో ఉస్మానియా, గాంధీ, నిలోఫర్ తప్ప వేరే ఆస్పత్రులు లేవని.. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదన్నారు. ఇదే పరిస్థితి మళ్లీ ఉండాలంటే, మళ్లీ మనమే రావాలన్నారు. మరోసారి మహిపాల్ రెడ్డిని దీవించాలని సీఎం కేసీఆర్ కోరారు.
Ratan Tata: నాలుగు సార్లు ప్రేమలో పడినా.. రతన్ టాటా ఎందుకు పెళ్లి చేసుకోలేదు?
ఏ ఉద్దేశంతో తెలంగాణను తెచ్చుకున్నామో.. దాన్ని బ్రహ్మాండంగా ఒకగాడిలో పెట్టుకొని ఆర్థికపరంగా ముందుకెళ్తున్నామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. పేదల సంక్షేమానికి కృషి చేస్తున్నామన్న ఆయన.. కేసీఆర్ కిట్‌తో పాటు మహిళలు గర్భిణులగా ఉన్నప్పుడే పుట్టబోయే బిడ్డ, తల్లి ఇద్దరు ఆరోగ్యంగా ఉండాలని న్యూట్రిషన్ కిట్‌ను కూడా తీసుకొచ్చామన్నారు. ఇస్నాపూర్‌లోనే 500 టన్నుల ఆక్సిజన్ తయారుచేసే యూనిట్‌నూ ఏర్పాటు చేసుకున్నామన్నారు. మంచి నాయకత్వం, మంచి ప్రభుత్వం ఉంటే అన్నీ సాధ్యమేనని.. రాబోయే రోజుల్లో ప్రభుత్వాన్ని దీవిస్తే, బ్రహ్మాండమైన అభివృద్ధిని చేసుకుందామని చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..