Site icon NTV Telugu

CM KCR: తెలంగాణలో పరిస్థితి తారుమారు అయ్యింది.. మోసపోతే గోసపడతాం

Kcr Speech

Kcr Speech

Telangana CM KCR Speech In Sangareddy Public Meeting: ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఒక ఎకరా అమ్మితే తెలంగాణలో 10 ఎకరాలు కొనుక్కునే పరిస్థితి ఉండేదని చంద్రబాబు చెప్పారని.. ఇప్పుడు పరిస్థితి తారుమారు అయ్యిందని అయనే అన్నాడని.. అంతలా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందిందని సీఎం కేసీఆర్ అన్నారు. సంగారెడ్డిలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. మూడు రోజుల పాటు గల్లీగల్లీలో తిరిగి సమస్యలు తెలుసుకున్నానని, పటాన్‌చెరు వరకు మెట్రో కావాలని అడిగారని చెప్పారు. రాష్టం ఏర్పడినప్పుడు ఎన్నో అపోహలు సృష్టించారని.. కానీ ఇప్పుడు 24 గంటలు కరెంట్ ఇచ్చే ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ, ఇంటింటికి మంచి నీళ్ళు ఇచ్చే ఏకైక రాష్టం కూడా తెలంగాణనే అని ఉద్ఘాటించారు.

Manchu Manoj: మంచు మనోజ్ భార్యను ఇలాంటి పోజ్ లో ఎప్పుడైనా చూశారా..?

అత్యదిక ట్రాఫిక్ ఉండే ప్రాంతం పటాన్ చెరు నుంచి హయత్ నగర్ అని పేర్కొన్న ఆయన.. మరోసారి తమని గెలిపిస్తే పటాన్‌చెరు వరకు మెట్రో వేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. తాము చెప్పింది చేస్తామని, ఎట్టి పరిస్థితుల్లోనూ మాట తప్పమని బల్లగుద్ది చెప్పారు. మూడు మున్సిపాలిటీలకు 30 కోట్లు, 55 గ్రామ పంచాయితీలకు రూ.15 లక్షలు నిధులు ఇస్తామన్నారు. పటాన్‌చెరును రెవెన్యూ డివిజన్ చేస్తామని మాటిచ్చారు. తెలంగాణలో మనం కడుతున్న డబుల్ బెడ్రూంలు దేశంలోనే ఎక్కడా లేవన్నారు. మోసపోతే మనం గోసపడతామని హెచ్చరించారు. హరీశ్ రావు వచ్చాక వైద్య రంగం పరుగులు పెడుతోందన్నారు. గతంలో హైదరాబాద్‌లో ఉస్మానియా, గాంధీ, నిలోఫర్ తప్ప వేరే ఆస్పత్రులు లేవని.. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదన్నారు. ఇదే పరిస్థితి మళ్లీ ఉండాలంటే, మళ్లీ మనమే రావాలన్నారు. మరోసారి మహిపాల్ రెడ్డిని దీవించాలని సీఎం కేసీఆర్ కోరారు.

Ratan Tata: నాలుగు సార్లు ప్రేమలో పడినా.. రతన్ టాటా ఎందుకు పెళ్లి చేసుకోలేదు?

ఏ ఉద్దేశంతో తెలంగాణను తెచ్చుకున్నామో.. దాన్ని బ్రహ్మాండంగా ఒకగాడిలో పెట్టుకొని ఆర్థికపరంగా ముందుకెళ్తున్నామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. పేదల సంక్షేమానికి కృషి చేస్తున్నామన్న ఆయన.. కేసీఆర్‌ కిట్‌‌తో పాటు మహిళలు గర్భిణులగా ఉన్నప్పుడే పుట్టబోయే బిడ్డ, తల్లి ఇద్దరు ఆరోగ్యంగా ఉండాలని న్యూట్రిషన్‌ కిట్‌ను కూడా తీసుకొచ్చామన్నారు. ఇస్నాపూర్‌లోనే 500 టన్నుల ఆక్సిజన్‌ తయారుచేసే యూనిట్‌నూ ఏర్పాటు చేసుకున్నామన్నారు. మంచి నాయకత్వం, మంచి ప్రభుత్వం ఉంటే అన్నీ సాధ్యమేనని.. రాబోయే రోజుల్లో ప్రభుత్వాన్ని దీవిస్తే, బ్రహ్మాండమైన అభివృద్ధిని చేసుకుందామని చెప్పుకొచ్చారు.

Exit mobile version