Site icon NTV Telugu

CM KCR: మహబూబాబాద్ లో బీఆర్ఎస్, కలెక్టరేట్ నూతన కార్యాలయం.. ప్రారంభించిన కేసీఆర్

Cm Kcr

Cm Kcr

BRS, Collectorate’s new office in Mahbubabad KCR started: మహబూబాబాద్‌ లో బీఆర్‌ఎస్‌ నూత కార్యాలయాన్ని సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు. బీఆర్‌ఎస్‌ కార్యాలయంలో పార్టీ పతాకాన్ని సీఎం ఆవిష్కరించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో పార్టీ నేత కార్యాలయాలను బీఆర్‌ఎస్‌ నిర్మించింది. ఇక కొత్త కలెక్టరేట్లతో పాటు పార్టీ జిల్లా కార్యాలయాలను కూడా ఒకేరోజు ప్రారంభించనున్నారు సీఎం కేసీఆర్‌. అయితే ఇవాళ పార్టీ కార్యాలయంతో పాటు కొత్త కలెక్టరేట్‌ కార్యాలయాన్ని కూడా ప్రారంభించారు సీఎం కేసీఆర్‌.

Read also: Anasuya: బెడ్ మీద అనసూయ.. వామ్మో ఓరేంజ్‌లో..

తెలంగాణ రాష్ట్ర ఏర్పడ్డాక.. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పార్టీ కార్యాలయాలను నిర్మించుకోవాలని బీఆర్‌ఎస్‌ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం ప్రకటించిన విషయం తెలిసిందే. కొత్తగా ఏర్పాటైన జిల్లాలతో పాటు పాత జిల్లాల్లో పార్టీ కార్యాలయాలు లేనిచోట కార్యాలయాలను నిర్మిస్తు.. పనులు పూర్తైన జిల్లాల్లో పార్టీ కార్యాలయాలను కేసీఆర్‌ ప్రారంభిస్తున్నారు. ఇక మహబూబాబాద్‌ లో సీఎం పర్యటన నేపథ్యంలో.. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు , సత్యవతి రాథోడ్ లు ఇక్కడే మకాం వేసి ఏర్పాట్లను పరిశీలించారు. రాష్ట్ర సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో పలువురిని పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ టూర్ ను అడ్డుకోకుండా పోలీసులు అరెస్ట్ లు నిర్వహించారు.
Kate Sharma: అలా వేసుకున్నా లేనట్టే.. ఇలాచూపిస్తే అబ్బాయిలు ఆగుతారా!

Exit mobile version