Site icon NTV Telugu

KCR: కేసీఆర్ సంచలన ప్రకటన.. త్వరలో జాతీయ పార్టీ

తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన చేశారు. ప్రజలంతా అవసరమని కోరుకుంటే దేశంలో కొత్త పార్టీ పెడతామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. జాతీయ పార్టీ పెడుతారా అని ఓ జ‌ర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు కేసీఆర్ ఇలా సమాధానమిచ్చారు. కొత్త పార్టీ ఎందుకు పెట్టకూడదు? పెడితే తప్పా? అని ప్రశ్నించారు. దేశంలో కొత్త పార్టీ పెట్టే దమ్ము తనకు లేదా అని నిలదీశారు. జాతీయ పార్టీ పెడితే తనను ఎవరు అడ్డుకుంటారన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు అనుకుంటే ఏమైనా జరగవచ్చన్నారు.

తాను పుట్టగానే సీఎంను అవుతానని తన తల్లిదండ్రులు కలగన్నారా? ఒక పద్ధతి ప్రకారం పనిచేస్తుంటే.. అవకాశాలు అవే వస్తాయని కేసీఆర్ తెలిపారు. తాను తెలంగాణ రాష్ట్ర స‌మితి పార్టీని ఏర్పాటు చేసిన‌ప్పుడు కూడా అంద‌రూ న‌వ్వార‌ని కేసీఆర్ గుర్తుచేశారు. అప్పుడు న‌వ్విన వారు.. ఇప్పుడు ఏం చేస్తున్నార‌ని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామ‌ని.. ఉద్యమం చేస్తామ‌ని తాను ప్రక‌టించిన నాడు కూడా అంద‌రూ న‌వ్వార‌న్నారు. కానీ ఇప్పుడు రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి చూపించామ‌న్నారు. ఇప్పుడు తాను జాతీయ పార్టీ పెట్టినా ఎవ‌రూ అడ్డుకోర‌ని కేసీఆర్ అభిప్రాయపడ్డారు.

Exit mobile version