Site icon NTV Telugu

ముందస్తు ఎన్నికలపై కేసీఆర్ క్లారిటీ.. ఈసారి కూడా టీఆర్ఎస్ గెలుస్తుందని ధీమా

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తాయని కొన్నిరోజులుగా ప్రచారం జరుగుతోంది. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తాయని పదే పదే చెప్తూ వస్తున్నారు. గతంలో మాదిరిగానే కేసీఆర్ ఈసారి కూడా తప్పకుండా ముందస్తు ఎన్నికలకు వెళ్తారని రేవంత్ జోస్యం చెప్పారు. అయితే తాము ముందస్తు ఎన్నికలకు వెళ్లే ప్రసక్తే లేదని సీఎం కేసీఆర్ ఈరోజు స్పష్టం చేశారు. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు వెళ్తామని ఆయన తెలిపారు.

https://ntvtelugu.com/cm-kcr-comments-on-india-new-constistution/

కావాలనే కొంతమంది సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని కేసీఆర్ మండిపడ్డారు. తమకు 103 సీట్లు ఉన్నాయని, ఇలాంటి సమయంలో ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళతామని కేసీఆర్ ప్రశ్నించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి 95 నుంచి 100 స్థానాలు వస్తాయని సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఈసారి ఎన్నికలకు ఆరు నెలలకు ముందే అభ్యర్థులను ప్రకటిస్తామని కేసీఆర్ ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో గెలవడానికి తమ దగ్గర బ్రహ్మాండమైన మంత్రం ఉందని తెలిపారు.

Exit mobile version