Site icon NTV Telugu

CM KCR: సీఎం కేసీఆర్ క్రిస్టమస్ శుభాకాంక్షలు

Cm Kcr

Cm Kcr

ప్రపంచమంతా మరికొద్ది గంటల్లో క్రిస్మస్ వేడుకలు జరుపుకోనుంది. ఈ సందర్భంగా ప్రముఖులు క్రైస్తవులకు శుభాకాంక్షలు అందచేస్తున్నారు. క్రిస్మస్‌ సందర్భంగా క్రైస్తవులకు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు శనివారం శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏసుక్రీస్తు బోధనలు విశ్వమానవ సహోదరత్వానికి దోహదం చేశాయని పేర్కొన్నారు. ఏసు శాంతి, కరుణ, సహనం, ప్రేమ విలువలను ప్రపంచానికి చాటారన్నారు. ఒక వైపు శాస్త్ర, సాంకేతిక రంగాలు గొప్పగా పురోగమిస్తున్నా, మరోవైపు మానవీయ విలువలు మృగ్యమైపోతున్న నేటి కాలంలో, క్రీస్తు బోధనలు ఆచరణీయమని తెలిపారు. శత్రువునైనా క్షమించే గొప్ప గుణం ఉండాలని క్రీస్తు బోధించారని, సాటి మనుషుల పట్ల ప్రేమ, కరుణ, సహనం అనే సద్గుణాల ఆచరణ అనివార్యమైందని సీఎం కేసీఆర్‌ అన్నారు. ఏసుక్రీస్తు దీవెనలు ప్రజలందరికీ లభించాలని సీఎం ఆకాంక్షించారు.

Read Also: Viral Video: పెళ్లి చేసుకోమని అడిగిన యువతి.. పిచ్చకొట్టుడు కొట్టిన యువకుడు

క్రిస్మస్ సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా అన్ని చర్చిలు అందంగా ముస్తాబు చేశారు. క్రిస్‌మస్ వేడుకలకు ముస్తాబైంది చారిత్రాత్మక మెదక్ చర్చి. అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు అధికారులు. రేపు తెల్లవారుజామునుంచి ప్రారంభం కానున్నాయి ప్రత్యేక ప్రార్థనలు. విద్యుత్ దీపాలతో వెలిగిపోతుంది ఆసియా ఖండంలోనే అతిపెద్ద చర్చి. తెలంగాణ,ఏపీతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న భక్తులు రానున్నారు. లక్షలాదిగా తరలి రానున్న భక్తులతో సందడిగా మారనుంది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసుల బందోబస్తు ఏర్పాట్లు చేశారు. డ్రోన్ కెమెరాలతో భద్రతను పర్యవేక్షిస్తున్నారు పోలీసు ఉన్నతాధికారులు.

Read Also: S-400: సరిహద్దులు శతృదుర్భేద్యం..రష్యా నుంచి భారత్‌కు ఎస్-400 క్షిపణి వ్యవస్థ

Exit mobile version