NTV Telugu Site icon

CM KCR Birthday Celebrations: నేడే తెలంగాణ సీఎం కేసీఆర్‌ పుట్టినరోజు.. రాష్ట్ర వ్యాప్తంగా సందడి

Kcr

Kcr

CM KCR Birthday Celebrations: టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కే చంద్రశేఖర్‌రావు జన్మదిన వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. సీఎం కేసీఆర్ ఇవాళ 69వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా సీఎం కేసీఆర్‌కు ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. దీంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా కేసీఆర్ జన్మదిన వేడుకలను టీఆర్‌ఎస్ శ్రేణులు ఘనంగా నిర్వహిస్తున్నారు. సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా సర్వమత ప్రార్థనలు, మొక్కలు నాటే కార్యక్రమాలు నిర్వహించనున్నారు. పక్క రాష్ట్రాల్లో కూడా కేసీఆర్ అభిమానులు కటౌట్లు ఏర్పాటు చేసి శుభాకాంక్షలు తెలిపారు. సోషల్ మీడియా వేదికగా కేసీఆర్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు, కేసీఆర్ అభిమానులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఓ ప్రైవేట్ స్కూల్ టీచర్ తన అభిమానాన్ని చాటుకున్నాడు. రాష్ట్రంలో అమలవుతున్న 100 సంక్షేమ పథకాలు, 2500 ముఖాలతో భారీ చిత్రపటాన్ని రూపొందించారు. వారం రోజుల పాటు కష్టపడి చేసిన ఈ చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

Read also: Astrology : ఫిబ్రవరి 17, శుక్రవారం దినఫలాలు

సీఎం కేసీఆర్ 1954 ఫిబ్రవరి 17న సిద్దిపేటలోని చింతమడకలో రాఘవరావు-వెంకటమ్మ దంపతులకు జన్మించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ పోరాడారు. ప్రత్యేక రాష్ట్ర సాధనే లక్ష్యంగా కేసీఆర్ 2021లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని స్థాపించి..2009లో స్వరాష్ట్రం కోసం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఆ తర్వాత కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించినట్లు ప్రకటించింది. నాలుగున్నరేళ్ల తర్వాత తెలంగాణ కల సాకారమైంది. ఏపీ విభజన తర్వాత 2014లో తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఎన్నికయ్యారు. రెండోసారి సీఎంగా ఎన్నికైన తర్వాత తెలంగాణ రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.
Delhi liquor scam: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు.. దూకుడు పెంచిన ఈడీ