Site icon NTV Telugu

విజయ దశమి.. సీఎం కేసీఆర్‌ ప్రత్యేక పూజలు

విజయ దశమి సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్‌ ప్రత్యేక పూజలు నిర్వమించారు.. ప్రగతి భవన్‌లోని నల్ల పోచమ్మ అమ్మవారి దేవాలయంలో కుటుంబ సమేతంగా అమ్మవారికి పూజలు నిర్వహించారు సీఎం కేసీఆర్…సంప్రదాయ బద్దంగా వాహన పూజ, అయధ పూజ ఘనంగా నిర్వహించారు. దసరా సందర్భంగా జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజ నిర్వహించిన ఆయన.. కుటుంబ సభ్యులు, సిబ్బందిని ఆశీర్వదించారు. ప్రగతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో సీఎం కేసీఆర్‌ సతీమణి శోభ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్-శైలిమ దంపతులు, హిమాన్షు, అలేఖ్య, టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి రావుల శ్రవణ్ కుమార్ రెడ్డి, సీఎం కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి, తదితర కుటుంబ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

Exit mobile version