కరీంనగర్ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన దళితబంధు పథకంపై సమీక్ష నిర్వహించారు.. ఇక, సమీక్ష తర్వాత హెలికాప్టర్‌లో హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం అయిన తెలంగాణ సీఎం.. సిద్దిపేట జిల్లాకు రాగానే మల్లన్న సాగర్ ప్రాజెక్టును పరిశీలించారు.. తొగుట మండలం తుక్కుపూర్ లో మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ ను హెలికాప్టర్ నుంచి వీక్షించారు.. కాగా, ఇప్పటికే ఆరు మోటార్ల ద్వారా మల్లన్న సాగర్ లోకి నీటిని ఎత్తిపోస్తున్నారు.. ఈ ఏడాది పది టీఎంసీల గోదావరి జలాలను మల్లన్న సాగర్ కి తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు.. కాగా, కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా.. నిర్మించిన మల్లన్న సాగర్ పూర్తి స్థాయి సామర్ధ్యం 50 టీఎంసీలుగా ఉంది..
మల్లన్న సాగర్‌లో కేసీఆర్ ఏరియల్ సర్వే..
