Site icon NTV Telugu

డ్ర‌గ్స్ కేసుల్లో ఎంత‌టివారున్నా వ‌దిలేది లేదు-కేసీఆర్

డ్ర‌గ్స్ వ్య‌వ‌హారంపై సీరియ‌స్ అయ్యారు తెలంగాణ ముఖ్య‌మంత్రి కె. చంద్ర‌శేఖ‌ర్ రావు.. ఇకపై రాష్ట్రంలో డ్రగ్స్‌ అనే మాట వినపడకుండా చేయాల‌ని ఆదేశించారు.. డ్రగ్స్‌ విషయంలో కఠినంగా వ్యవహరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు సీఎం కేసీఆర్‌.. ఇక‌, డ్రగ్స్‌ నియంత్రణకు తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై ప్ర‌త్యేకంగా ఫోక‌స్ పెట్ట‌నున్నారు కేసీఆర్.. దీని కోసం ఎల్లుండి ప్రగతిభవన్‌లో స్టేట్ పోలీస్ అండ్ ఎక్సైజ్ కాన్ఫరెన్స్ నిర్వహించ‌బోతున్నారు.. ఈ కార్యక్రమానికి హోంమంత్రి మ‌హ‌మూద్ అలీ, ఎక్సైజ్‌ మంత్రి, సీఎస్, డీజీపీ, డీజీలు, సీపీలు, ఎస్పీలు, ఎక్సైజ్‌ శాఖ ఉన్నతాధికారుల‌ను ఆహ్వానించిన‌ట్టుగా తెలుస్తోంది.. ఇక‌, డ్ర‌గ్స్ కేసుల్లో ఎంత‌టివారున్నా వ‌దిలేది లేద‌ని స్ప‌ష్టం చేశారు కేసీఆర్.. వెయ్యి మందితో నార్కోటిక్‌, ఆర్గ‌నైజ్డ్ క్రైమ్ కంట్రోల్ సెల్ ఏర్పాటు చేయ‌బోతున్నామ‌న్నారు.. డీజీపీ మ‌హేంద‌ర్‌రెడ్డి ఆధ్వ‌ర్యంలో ప్ర‌త్యేక విభాగం ఏర్పాటు చేయ‌బోతున్నాం.. మాద‌క‌ద్ర‌వ్యాలు వినియోగిస్తున్న‌వారిని వ‌దిలి పెట్టొద్ద‌ని స్ప‌ష్టం చేశారు సీఎం కేసీఆర్.

Read Also: కేసీఆర్‌కు ఒక్కటే హెచ్చరిక.. రాముల‌మ్మ వార్నింగ్

Exit mobile version