Site icon NTV Telugu

తెలంగాణ కరోనా అప్‌డేట్‌..24 గంటల్లో 848

తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం… గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 848 కోవిడ్‌ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. మరో 06 మంది కరోనా బాధితులు మృతిచెందారు.. ఇక, 1114 మంది కోవిడ్‌ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు.

read also : టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు తలపోటుగా పోడు భూముల సమస్య !

దీంతో.. ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య 6,26,085 కు చేరగా.. రికవరీ కేసులు 6,09,947 కు పెరిగాయి.. ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 3,684 గా ఉంది.. కోవిడ్ బాధితుల రికవరీ రేటు 97.42 శాతంగా ఉందని.. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 12,454 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని.. గత 24 గంటల్లో 1,08, 954 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించామని బులెటిన్‌లో పేర్కొంది సర్కార్.

Exit mobile version