NTV Telugu Site icon

ఉద్యోగుల‌కు గుడ్‌న్యూస్‌.. పీఆర్సీ అమ‌లుకు ముంద‌డుగు..!

kcr

పీఆర్సీ అమ‌లు కోసం గ‌త కొన్ని నెల‌లుగా ఎరుదుచూస్తున్నారు తెలంగాణ ప్ర‌భుత్వ ఉద్యోగులు.. అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల్లో సీఎం కేసీఆర్ పీఆర్సీని ప్ర‌క‌టించ‌డంతో.. ఇక త్వ‌ర‌లోనే అమ‌లు అవుతాయ‌ని.. జీతాలు పెరుగుతాయ‌ని అంతా ఎదురుచూస్తూ వ‌చ్చారు.. అయితే, ఉప ఎన్నిక‌లు, మ‌రికొన్ని కార‌ణాల‌తో పీఆర్సీ అమ‌లు వాయిదా ప‌డుతూవ‌చ్చింది. కానీ, రేపు జ‌ర‌గ‌నున్న కేబినెట్ స‌మావేశంలో దానికి మోక్షం ల‌భించే అవ‌కాశం ఉంది.. రేపటి కేబిట్ స‌మావేశంలో పీఆర్సీపై చ‌ర్చించ‌నున్నారు.. ఉద్యోగుల వేతన సవరణ పూర్తి నివేదికను కేబినెట్‌కు స‌మ‌ర్పించ‌నుంది ఆర్థిక‌శాఖ‌.. దానిపై చ‌ర్చించి కేబినెట్ ఆమోదించ‌నుంది.. ఇక‌, పీఆర్సీ అమ‌లుకు సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న‌, ఉత్త‌ర్వులు కూడా రేపు వెలువ‌డే అవ‌కాశం ఉంది.