Site icon NTV Telugu

నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం.. లాక్ డౌన్ పై?

నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్‌లో కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. మూడో విడత లాక్‌డౌన్‌ గడువు ఈ నెల 9తో ముగుస్తుంది. దీంతో తదుపరి కార్యాచరణ కోసం కేబినెట్ మరోసారి సమావేశమవుతోంది. లాక్ డౌన్ సడలింపుపై ఈ భేటీలో నిర్ణయం తీసుకోనున్నారు. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ఆంక్షలను మరింత సడలించాలని ప్రభుత్వం భావిస్తోంది.

ఇక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎంతగానో ఎదురుచూస్తున్న వేతన సవరణ (పీఆర్సీ) అమలుపై సీఎం కేసీఆర్‌ మంగళవారం కీలక ప్రకటన చేసే అవకాశముంది. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు సిబ్బంది జీతాలకు సంబంధించిన అంశాలపై కూడా చర్చించే అవకాశం కనిపిస్తోంది.

Exit mobile version