Site icon NTV Telugu

BJP : సేవ్ హైదరాబాద్ పేరుతో బీజేపీ ఆందోళన.. సచివాలయం వద్ద ఉద్రిక్తత..!

Bjp Telangana

Bjp Telangana

BJP : తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఉత్కంఠ పెరిగింది. రాష్ట్ర సచివాలయం ముట్టడికి బీజేపీ పిలుపునివ్వడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. “సేవ్ హైదరాబాద్” పేరుతో బీజేపీ నేతలు సచివాలయం వద్ద నిరసనలు చేపట్టగా, పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఆరు జిల్లాల నుంచి భారీ సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు, నేతలు సచివాలయం వైపు చేరుకున్నారు. అయితే ముందస్తుగానే పోలీసులు కఠినమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. నిరసనకు దిగిన వారిని అదుపులోకి తీసుకుని, పోలీసు వాహనాల్లో తరలించారు. దీంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

US visa review: యూఎస్‌లో ప్రమాదం అంచున 5.5 కోట్ల మంది.. కొంచెం తేడా అనిపించినా అంతే..

బీజేపీ ప్రధానంగా హైలైట్ చేసిన అంశాలు—హైదరాబాద్‌లో ఇటీవల చోటుచేసుకున్న కరెంట్ తీగలతో జరిగిన మరణాలు, డ్రైనేజీ సమస్యలు, వర్షాకాలంలో మరింత ప్రమాదకరంగా మారిన గుంతల రోడ్లు. ఈ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయం లేకపోవడమే ప్రజలు ఇబ్బందులు పడటానికి కారణమని బీజేపీ ఆరోపిస్తోంది. జీహెచ్‌ఎంసీ, హైడ్రా, జలమండలి విభాగాలు తగిన సమన్వయంతో పనిచేయకపోవడం వల్ల సమస్యలు అలాగే కొనసాగుతున్నాయని నేతలు విమర్శించారు. నిరసనల నేపథ్యంలో ఇప్పటికే గ్రేటర్ పరిధిలో పలువురు బీజేపీ కార్పొరేటర్లు, కీలక నేతలను పోలీసులు హౌజ్ అరెస్టులో ఉంచారు. అయినప్పటికీ నిరసనలు విస్తరించే అవకాశం ఉందన్న అంచనాతో పోలీసులు ఎక్కడికక్కడ భారీగా మోహరించారు. ఈ పరిణామాలతో తెలంగాణ రాజకీయాల్లో వేడి మరింతగా పెరిగినట్టే అనిపిస్తోంది.

Dharma Mahesh : ప్రెగ్నెంట్ టైంలో నన్ను చంపాలని చూశాడు.. హీరో ధర్మ మహేష్ బండారం బయటపెట్టిన భార్య గౌతమి

Exit mobile version