Site icon NTV Telugu

తెలంగాణ బీజేపీ ఎంపీల‌తో రేపు అమిత్ షా భేటీ..!

తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో రేపు భేటీ కానున్నారు. రెండు రోజుల కిందట అమిత్ షా అపాయింట్మెంట్ కోరారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్. ఈ నేప‌థ్యంలోనే… బండి సంజయ్ కు అమిత్ షా ఆఫీస్ నుంచి ఫోన్ వ‌చ్చింది.

రేపు (09.12.2021 గురువారం) అందుబాటులో ఉండాలని బండి సంజయ్ కు అమిత్ షా ఆఫీస్ నుంచి ఆదేశాలు వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో సహా నలుగురు ఎంపీలు, ముగ్గురు ఎమ్మెల్యేలను అమిత్ షా తో భేటీకి తీసుకెళ్లనున్నారు తెలంగాణ రాష్ట్ర ఇంచార్జీ తరుణ్ చుగ్. రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర, రాష్ట్ర రాజకీయాలు, ముఖ్యంగా వరి విషయంలో స్టేట్ గవర్నమెంట్ వైఖరిపై ఈ సంద‌ర్భంగా అమిత్ తో చర్చించే అవకాశం ఉన్న‌ట్లు స‌మాచారం అందుతోంది.

Exit mobile version