Site icon NTV Telugu

Komatireddy Venkat Reddy : తెలంగాణ చరిత్రలో మరో మైలురాయి

Komatireddy

Komatireddy

Komatireddy Venkat Reddy : తెలంగాణలో సామాజిక న్యాయం సాధన దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఖరారు చేస్తూ ప్రభుత్వం జీవో నెంబర్ 9ను విడుదల చేసింది. ప్రభుత్వం తెలిపిన ప్రకారం, ఈ నిర్ణయం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తీసుకోబడింది. వెనుకబడిన వర్గాల ఆత్మగౌరవానికి భరోసా ఇవ్వడమే కాకుండా, భవిష్యత్ తరాలకు ఉజ్వల భవిష్యత్తును నిర్మించే దిశగా ఇది పెద్ద అడుగు కానుంది.

Russia–China: ముంచుకొస్తున్న మరో యుద్ధం.. తైవాన్‌పై దాడికి చైనాకు రష్యా సాయం..!

ఇకపై స్థానిక సంస్థల్లో బీసీలకు మరిన్ని రాజకీయ అవకాశాలు లభించనున్నాయి. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో సమాన ప్రాతినిధ్యం అందించడమే ఈ నిర్ణయ ప్రధాన ఉద్దేశం అని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ, “ఈ నిర్ణయం సమాజం మొత్తం అభివృద్ధి దిశగా ముందడుగు వేయనుంది. సామాజిక న్యాయాన్ని సాధించేందుకు, వెనుకబడిన వర్గాల సాధికారత కోసం ప్రభుత్వం కట్టుబడి ఉంది” అని పేర్కొన్నారు.

Manchu Manoj : నా బయోపిక్ ఆ డైరెక్టరే తీయాలి.. మనోజ్ కామెంట్స్

Exit mobile version