Cough Syrups : ఆ దగ్గు మందులను నిషేధిస్తూ తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు

  • రెండు దగ్గు మందుల విక్రయాలను నిషేధించిన తెలంగాణ ప్రభుత్వం
  • రీలైఫ్‌, రెస్పీఫ్రెష్‌-టీఆర్‌ దగ్గు మందులను నిషేధిస్తూ ప్రభుత్వం ఆదేశాలు
  • ఈ రెండు దగ్గు మందులను విక్రయించొద్దంటూ తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు
  • ఈ రెండు దగ్గు మందుల్లోనూ కల్తీ జరిగినట్లు గుర్తింపు.
Ts Gov Logo

Ts Gov Logo

Cough Syrups : చిన్నారులలో తీవ్రమైన రోగాల్ని, మరణాలను కలిగిస్తున్న ప్రమాదకర దగ్గు మందులను రాష్ట్ర ప్రభుత్వం నిషేధిస్తూ చర్య తీసుకుంది. రీలైఫ్‌, రెస్పీఫ్రెష్-టీఆర్ అనే రెండు సిరప్‌లను విక్రయించరాదు అని తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయం పిల్లల భద్రతను ముఖ్యంగా పరిగణించి తీసుకోవడం విశేషం. మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో కోల్డ్‌రిఫ్ సిరప్ కారణంగా 16 చిన్నారుల మరణాలు చోటు చేసుకున్న ఘటనల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.

Karur Stampede: సుప్రీంకోర్టుకు విజయ్.. కరూర్ ఘటనపై స్వతంత్ర దర్యాప్తు చేయాలని వినతి

×
×
Ad

డాక్టర్ల పర్యవేక్షణ లేకుండా ఎడపెడా పిల్లలకు దగ్గు, జలుబు సిరప్‌లు ఇవ్వకూడదని అధికారిక సూచనలు కూడా జారీ అయ్యాయి. కాంచీపురంలోని Sresan Pharmaceuticals తయారు చేసిన కోల్డ్‌రిఫ్ సిరప్‌పై ఫుడ్‌ అండ్ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్ తనిఖీలు నిర్వహించింది. ఈ సిరప్‌ను తక్షణం తెలంగాణలో విక్రయించరాదు అని ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్రంలోని అన్ని హాస్పిటళ్లు, ఫార్మసీలు ఈ నిషేధాన్ని వెంటనే అమలు చేయాల్సినట్లు సూచించబడింది.

IMC 2025: ఆసియాలోనే అతిపెద్ద టెలికాం ఈవెంట్.. ఇండియా మొబైల్ కాంగ్రెస్ ను ప్రారంభించిన పీఎం మోడీ