Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేటితో ముగియనున్నాయి. అసెంబ్లీలో కులగణన తీర్మానం నేటికి వాయిదా పడింది. ఇవాళ సభలో కుల జనగణన తీర్మానం పెట్టాలని కాంగ్రెస్ సర్కార్ భావించింది. ఈ రోజు సభలో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క ద్రవ్య వినిమయ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టగా.. ఆ బిల్లుపై చర్చ ఆలస్యం కావడంతో కులగణన తీర్మానం నేటికి వాయిదా పడింది. ఇవాల ఉదయం 10 గంటలకు సభలో కులగణన తీర్మానాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రవేశపెట్టనున్నారు. ఆ తర్వాత నీటిపారుదల శాఖపై శ్వేతపత్రాన్ని ప్రభుత్వం విడుదల చేయనుంది. ఇరిగేషన్ శాఖపై శ్వేతపత్రాన్ని ఆ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విడుదల చేయనున్నారు.
Read also: Zomato Stock Price: బుల్లిష్ గా మారిన జొమాటో స్టాక్.. ఇన్వెస్టర్లకు 47శాతం లాభాలు తెచ్చే ఛాన్స్
నీటిపారుదల రంగంపై రాష్ట్ర ప్రభుత్వం నేడు శాసనసభలో శ్వేతపత్రం విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. సాగునీటిపై శ్వేతపత్రం విడుదల చేస్తామని ప్రభుత్వం కొంతకాలంగా చెబుతోంది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన కూడా చేశారు. ఈ నేపథ్యంలో ఇవాలే విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గత పదేళ్లలో సాగునీరు అందించకుండా కాంట్రాక్టర్లకు పనులు అప్పగించేందుకే ప్రభుత్వం ప్రాజెక్టులు చేపట్టిందని ఆరోపిస్తోంది. ఈ అంశాలతో పాటు కాళేశ్వరం లిఫ్టు పథకంలో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణం, కృష్ణా ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పగించడం వంటి అంశాలను శ్వేతపత్రంలో పొందుపరిచిన విషయం తెలిసిందే. దీనిపై స్వల్పకాలిక చర్చ కూడా జరపాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. మరోవైపు కుల గణన తీర్మానాన్ని కూడా ప్రభుత్వం నేడు శాసనసభలో ప్రవేశపెట్టనుంది. నిజానికి ఈ తీర్మానాన్ని గురువారమే సభలో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావించింది. అయితే బడ్జెట్, ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ చాలాసేపు సాగినా కుదరలేదు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇవాళ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు.
Astrology: ఫిబ్రవరి 16, శుక్రవారం దినఫలాలు