Site icon NTV Telugu

Telangana Assembly: ఈరోజు అసెంబ్లీ సమావేశాల ఎజెండా ఇదే!

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. శనివారం 10 గంటలకు ప్రారంభం కానున్నాయి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు. 5 వ రోజు కొనసాగనుంది శాసనసభ. సభ ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాలు చేపడతారు. ఇవాళ చేపల పెంపకం, హైదరాబాద్ నగరంలో నాలాల అభివృద్ధి కార్యక్రమం గురించి చర్చిస్తారు. అలాగే, నిర్మాణ రంగ కార్మికుల సంక్షేమం, జీహెచ్‌ఎంసీతో పాటు ఇతర నగరాల్లో ఆర్టీసీ బస్ ల సౌకర్యం గురించి మంత్రులు సమాధానం ఇస్తారు,

రాష్ట్రంలో నేత కార్మికుల సంక్షేమం, భూపాల పల్లి పట్టణానికి బైపాస్ రోడ్, బాహ్య వలయ రహదారి గ్రామాలకు తాగు నీరు, జర్నలిస్టుల సంక్షేమం, రోడ్ల ను వెడల్పు చేసే సమయంలో అవరోధాలు తొలగింపు వంటి అంశాలుంటాయి. నూతనంగా ఏర్పడిన మండలల్లో మండల సముదాయాల భవన నిర్మాణాలు,అనంతరం సభలో రెండు బిల్స్ తో పాటు 6 పద్దులు చర్చకు రానున్నాయి. సాంకేతిక విద్య ,పర్యాటకం , మెడికల్ అండ్ హెల్త్ , మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్ మెంట్ ,లేబర్ ఎంప్లాయిమెంట్ , అడవుల అభివృద్ధి పై సభలో చర్చ జరగనుంది.

https://ntvtelugu.com/whats-today-as-on-march-12-2022/
Exit mobile version