సీఎం కేసీఆర్.. అసెంబ్లీలో బడ్జెట్ పై ప్రసంగించబోతున్నారు. నిరుద్యోగులకు శుభవార్త చెప్పబోతున్నారు.. అందరూ తన ప్రసంగం వినాలని కోరారు. ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీల భర్తీపై.. నిరుద్యోగుల్లో మొదటి నుంచి అసంతృప్తి ఉంది. తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగం అని ప్రచారం చేశారని… ఈ హామీ నిలబెట్టు కోలేదనే విమర్శలు ఉన్నాయి. ఇటు విపక్షాలు, అటు నిరుద్యోగులు ఆందోళనబాటలో ఉన్నాయి. నీళ్లు, నిధులు, నియామకాలు అనేది తెలంగాణ ఉద్యమ స్లోగన్. ఇందులో మొదటి రెండింటి విషయంలో న్యాయం జరిగిందన్న అభిప్రాయం ఉన్నా.. ఉద్యోగాల విషయంలో మాత్రం అసంతృప్తి ఉంది. నిరుద్యోగులకు భృతి ఇస్తామని చెప్పినా అదీ చేయలేదు. ఇప్పుడు నిరుద్యోగులను సంతృప్తి పరిచేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రభత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నపోస్టులన్నింటిని భర్తీ చేయనున్నట్లు సమాచారం. దాదాపు లక్ష ఉద్యోగాల భర్తీకి కేసీఆర్ ప్రకటన చేసే ఛాన్స్ ఉంది. ఇక, కేసీఆర్ ఏం చెబుతున్నారో తెలుసుకోవాడనికి కింది వీడియోను క్లిక్ చేయండి…
Live: నిరుద్యోగులకు కొలువుల జాతర?
