NTV Telugu Site icon

Telangana Temperatures: తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు.. సాధారణంగా కంటే మూడు డిగ్రీల అధికం

High Tempurecher In Telangana

High Tempurecher In Telangana

Telangana Temperatures: తెలంగాణ, ఏపీలో ఎండల తీవ్రత పెరుగుతోందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రాల్లో సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వెల్లడించారు. ఇక మధ్యాహ్న సమయంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలోని పలు జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రత 33 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశం ఉంది. కాగా.. రాత్రి సమయంలో ఉష్ణోగ్రతలు 22 డిగ్రీలకు చేరుకునే అవకాశం ఉంది. పగటిపూట వాతావరణం పొడిగా ఉంటుందని, ఎండ తీవ్రత క్రమంగా పెరుగుతుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. తెలంగాణలో ఎండలు రోజురోజుకూ ముదురుతున్నాయి. మార్చి ప్రారంభం కాకుండానే ఉష్ణోగ్రతలు పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు దాదాపు 4 డిగ్రీల మేర పెరిగినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు 32 నుంచి 37 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయని పేర్కొంది.

Read also: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

ఇక రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత భారీగా పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. కానీ రాత్రి ఉష్ణోగ్రతలు 20 డిగ్రీలుగా నమోదవుతున్నాయి. మార్చి నెలలో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గతేడాదిలాగే వడగాల్పుల ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. తెలంగాణ రాత్రిపూట చల్లగా ఉన్నప్పటికీ పగటిపూట వేడిగా ఉంటుంది. గతేడాది ఇదే సమయానికి 15-20 డిగ్రీలు నమోదవగా… ఈసారి 32 డిగ్రీలు దాటింది. దీంతో ఏప్రిల్, మే నెలల్లో ఎండలు మండిపోతాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గత ఏడాది సూర్య గతంలో ఎన్నడూ లేని రికార్డులను బద్దలు కొట్టాడు. విపరీతమైన వేడి కారణంగా ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఈ ఏడాది కూడా అదే స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో వారు ఆందోళన చెందుతున్నారు.
Sudan : సూడాన్ దేశాన్ని వదిలి వెళ్లిపోతున్న జనాలు.. దాదాపు ఖాళీ