Site icon NTV Telugu

CM Revanth Reddy : సీఎం రేవంత్‌ తో అజయ్ దేవగణ్ భేటీ.. తెలంగాణలో అంతర్జాతీయ స్థాయి ఫిల్మ్ స్టూడియో..!

Ajay Devgn, Cm Revanth Redd

Ajay Devgn, Cm Revanth Redd

CM Revanth Reddy : తెలంగాణలో అత్యాధునిక సాంకేతికతతో కూడిన ఫిల్మ్ స్టూడియో ఏర్పాటు కోసం ప్రముఖ బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ ఆసక్తి చూపించారు. ఈ క్రమంలో, సోమవారం ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన కలిశారు. ఈ సమావేశంలో, యానిమేషన్‌, వీఎఫ్ఎక్స్‌, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వంటి రంగాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని, తెలంగాణలోనే ఒక అంతర్జాతీయ ప్రమాణాల ఫిల్మ్ స్టూడియో ఏర్పాటుకు అవకాశం కల్పించాలని అజయ్ దేవగణ్ సీఎం రేవంత్ రెడ్డిని కోరారు.

Dost 2025 : తెలంగాణ డిగ్రీ ప్రవేశాల్లో నిరాశ.. 32 శాతం సీట్లు మాత్రమే భర్తీ

కేవలం ఫిల్మ్ స్టూడియోనే కాకుండా, సినీ పరిశ్రమకు అవసరమైన నిపుణులను తయారు చేసేందుకు ప్రత్యేక నైపుణ్య శిక్షణ కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు అజయ్ దేవగణ్ తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం అందించాలని ఆయన అభ్యర్థించారు. తెలంగాణ అభివృద్ధి, రాష్ట్రంలో కొనసాగుతున్న విధానాలు, రంగాలవారీగా అభివృద్ధి కార్యక్రమాల గురించి సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. దీనికి స్పందించిన అజయ్ దేవగణ్, ‘తెలంగాణ రైజింగ్’ ప్రచార కార్యక్రమాల్లో మీడియా, సినిమా రంగాల్లో తన వంతు పాత్రను పోషించేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. ఈ భేటీలో ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, కేంద్ర పథకాల సమన్వయ కార్యదర్శి డాక్టర్ గౌరవ్ ఉప్పల్ పాల్గొన్నారు.

Rajasab : ‘రాజాసాబ్’ లోకి మరో స్టార్ హీరోయిన్ ఎంట్రీ.. మాస్ ఆడియెన్స్‌కు పండుగే !

Exit mobile version