Occupy Forest Land: ఖమ్మం జిల్లా తల్లాడ మండల పరిధిలోని వెంకరముని తండాకు చెందిన 18 మంది గిరిజనులపై అటవీశాఖకు చెందిన భూమిని ఆక్రమించుకునేందుకు యత్నించినట్లు కేసు నమోదు చేశారు. సోమవారం (నిన్న) గ్రామంలోని వివాదాస్పద స్థలంలో గిరిజనులు మామిడి మొక్కలు నాటకుండా అటవీ రేంజ్ అధికారి (ఎఫ్‌ఆర్‌ఓ) కె.అరవింద్ నేతృత్వంలోని అటవీ సిబ్బంది బృందం అడ్డుకున్నట్లు వర్గాలు తెలిపాయి. ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్నామని నిర్వాసితులు చెబుతుండగా గిరిజనులు ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని అధికారులతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
Read also: TCS : ‘మూన్ లైటింగ్’ పై ఐటీ కంపెనీలు సీరియస్
అటవీ శాఖకు చెందిన ఆ భూమిని గిరిజనులు ఆక్రమించుకునేందుకు ప్రయత్నించడం ఇదే తొలిసారి అని ఎఫ్‌ఆర్‌వో అరవింద్ తెలిపారు. మండలంలో మొత్తం 14,900 హెక్టార్ల అటవీ భూమి ఉండగా అందులో 600 హెక్టార్లు మాత్రమే వివాదంలో ఉందని, గిరిజనులు సాగు హక్కుల కోసం దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. అనంతరం పోడు భూముల సమస్యపై పోలీసులు, రెవెన్యూ అధికారులు గ్రామానికి వెళ్లి నిర్వాసితులతో మాట్లాడారు.
India Vs South Africa 3rd Odi Live: నేడే సఫారీలతో ఫైనల్ పోరు.. నువ్వా నేనా?