NTV Telugu Site icon

SSC Supplementary Results: నేడే తెలంగాణ‌ టెన్త్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలు..

Ssc Supplementary Results

Ssc Supplementary Results

SSC Supplementary Results: తెలంగాణ ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదలకు రంగం సిద్దమైంది. ఇవాళ ఫలితాలు విడుదల చేయనున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు అధికారికంగా ప్రకటించింది. ఈనేపథ్యలో ఇవాళ మధ్యాహ్నం ప‌దో త‌ర‌గ‌తి అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్షల ఫ‌లితాలు విడుద‌ల కానున్నాయి. ఫ‌లితాల‌ను www.bse.telangana.gov.in అనే వెబ్‌సైట్లలో చూసుకోవ‌చ్చు. ఇటీవల తెలంగాణ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (TSBSE) TS SSC సప్లిమెంటరీ పరీక్ష 2023ని టెన్త్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్షల‌ను జూన్ 14 నుంచి 22వ తేదీ వ‌ర‌కు నిర్వహించిన సంగ‌తి తెలిసిందే.

Read also: World Cup 2023 Qualifiers: స్కాట్లాండ్‌పై సంచలన విజయం.. వన్డే ప్రపంచకప్‌కు నెదర్లాండ్స్‌ అర్హత!

మొత్తం 13.4శాతం మంది విద్యార్థులు మొదటి ప్రయత్నంలో 10వ తరగతి పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేదు. 10వ తరగతిలో ఉత్తీర్ణత సాధించడానికి తమ మార్కులు, గ్రేడ్‌ను మెరుగుపరచుకోవడానికి అర్హత లేని విద్యార్థులకు రెండవ అవకాశంగా TSBSE ఈ సెకండరీ అవకాశాన్ని అందించింది. అయితే.. సప్లిమెంటరీ పరీక్షలను 259 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించగా.. 71వేల 738 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఇదిలా ఉండగా జూన్ 12 నుంచి 20వ తేదీ వరకు ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లై పరీక్షలను నిర్వహించడం తప్పనిసరి. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 933 పరీక్షా కేంద్రాల్లో సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించారు. ప్రథమ సంవత్సరం, ద్వితీయ సంవత్సరంలో మొత్తం 4,12,325 మంది పరీక్షకు హాజరయ్యారు. అలాగే జూన్ 5 నుంచి 9వ తేదీ వరకు ప్రాక్టికల్స్ నిర్వహించారు.
Delhi: ఢిల్లీలో ఓ మహిళ మూడేళ్లపాటు 14కుక్కలను ప్లాట్లో బంధించి ఘోరం