NTV Telugu Site icon

Teachers Strike: దంపతుల ధర్నాతో దద్దరిల్లిన ధర్నా చౌక్.. బోనాలతో ప్రత్యేక ర్యాలీ..

Dharna Chowk Teacher Transfers

Dharna Chowk Teacher Transfers

Teachers Strike: ఉపాధ్యాయ దంపతుల బదిలీలు కోసం ధర్నా చౌక్ లో నిర్వహించిన ఆవేదన సభ స్పౌజ్ బదిలీలు జరపండనే నినాదాలతో దద్దరిల్లింది. 13 జిల్లాల్లో నిలిచిపోయిన ఉపాధ్యాయ దంపతుల బదిలీలు వెంటనే జరపాలని నేడు ఇందిరాపార్క్ వద్ద ధర్నా చౌక్ లో 13 జిల్లాల ఉపాధ్యాయ దంపతులు ఆవేదన సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 13 జిల్లాల నుంచి ఉపాధ్యాయ దంపతులు వందలాదిగా తరలివచ్చారు. వారితో పాటు వారి పిల్లలు, వయోధికులైన తల్లిదండ్రులు కూడా ఈ ఆవేదన సభ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉపాధ్యాయ దంపతుల బదిలీలు వెంటనే చేపట్టాలని.. భార్య ఒక జిల్లాలో, భర్త మరొక జిల్లాలో 18 నెలలుగా నరకయాతన అనుభవిస్తున్నామని ఉపాధ్యాయ దంపతులు ఆవేదన చెందారు. తమ ఆవేదన దీక్షను గమనించైనా ప్రభుత్వం వెంటనే స్పందించి స్పాజ్ బదిలీలు జరిపించాలని అభ్యర్థించారు. బోనాలతో తెలంగాణ అంతటా పండుగ వాతావరణం ఉన్న ఈ సందర్భంలోనూ తమ బదిలీలు జరగక ఆవేదనలో ఉన్నామని.. అమ్మవారికి ప్రత్యేక బోనాలను తయారు చేయించి.. మహిళా ఉపాధ్యాయులు ర్యాలీగా అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. ఆషాడం బోనాల సందర్భంగా ఆయనా అమ్మవారి దయ మాపై కురిపించి బదిలీలను వెంటనే జరిపించాలని ఆవేదన సభ సాక్షిగా మహిళా ఉపాధ్యాయులు వేడుకున్నారు..

Read also: Mahankali Bonalu: మహంకాళి బోనాల ఉత్సవాల్లో అపశృతి.. షార్ట్ సర్క్యూట్ తో వ్యక్తి మృతి

ఉపాధ్యాయ దంపతుల బదిలీలు 13 జిల్లాల్లో నిలిచిపోయాయి. దీంతో వందలాది ఉపాధ్యాయ కుటుంబాలు చిన్నాభిన్నమై గడచిన 18 నెలలుగా మనోవేదన అనుభవిస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా తమ బదిలీలు వెంటనే చేపట్టాలని 13 జిల్లాల నుంచి వందలాదిగా ఉపాధ్యాయులు ఆవేదన సభకు తరలివచ్చారు. ఇందిరా పార్క్ వద్ద ఉన్న ధర్నా చౌక్ లో నిర్వహించిన ఈ కార్యక్రమం ఉపాధ్యాయుల నినాదాలతో మారుమోగింది. దంపతుల బదిలీలు జరగకపోవడంతో భర్త ఒక జిల్లాలో, భార్య మరొక జిల్లాలో విధులు నిర్వహించాల్సిన దారుణ పరిస్థితులు దాపురించాయని…. కుటుంబాలుగా విడిపోయి, పిల్లలను చూసుకోలేక, వయోదికులైన తల్లిదండ్రులను చూసుకోలేక, దంపతులుగా విడిపోయి నరకయాతన అనుభవిస్తున్నామని… మహిళా ఉపాధ్యాయులు ఆవేదన చెందారు.. ఇక ఎంత మాత్రమూ ఈ బాధను భరించలేమని మహిళా ఉపాధ్యాయులు కన్నీటిపర్యంతమయ్యారు. వివిధ జిల్లాల నుంచి తరలివచ్చిన ఉపాధ్యాయినీలు తమ బదిలీలను వెంటనే జరిపించాలని ఆవేదన సభ వేదికగా సీఎం కేసీఆర్ ను, మంత్రులను అభ్యర్థించారు. స్పోజ్ బదిలీలు నిర్వహించి తమ తల్లిదండ్రులను కుటుంబాలను కలపాలని చిన్నారులు ఆవేదన చెందడం అందరినీ కలచివేసింది.

Read also: Revanth Reddy: తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే సీతక్క సీఎం..! రేవంత్ సంచలన వ్యాఖ్యలు..

ధర్నా చౌక్ లోని ఆవేదన సభ కార్యక్రమానికి ఉపాధ్యాయ దంపతులు వారి పిల్లలతో సహా తరలివచ్చారు. ఉపాధ్యాయ దంపతుల బదిలీలు జరగకపోవడంతో వారి కుటుంబాలు అనుభవిస్తున్న ఇబ్బందులను పిల్లలు కన్నీటి రోదనల మధ్య వివరించడం అందరికంటే నీరు తెప్పించింది. ఇప్పటికైనా స్పందించి తమ తల్లిదండ్రులను కుటుంబాలను కలపాలని చిన్నారులు ఆవేదన సభ ద్వారా ముఖ్యమంత్రిగా గారిని వేడుకున్నారు. ధర్నా చౌక్ లో స్కౌజ్ బదిలీల కోసం జరిగిన ఉపాధ్యాయ దంపతుల ఆవేదన సభకు అన్ని ఉపాధ్యాయ సంఘాలు మద్దతు పలికాయి. పి ఆర్ టి యు యు టి ఎఫ్ టి పి టి ఎఫ్ ఆఫర్స్ తపస్ తదితర ఉపాధ్యాయ సంఘాల నాయకులు దీక్షా శిబిరానికి చేరుకొని తమ మద్దతును ప్రకటించారు. ప్రభుత్వం వారు వెంటనే స్పందించి ఉపాధ్యాయ దంపతుల బదిలీలను వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు.

స్పాంజ్ బదిలీలు జరిగేంత వరకు తమ సంఘాలు అండగా ఉంటాయని స్పష్టం చేశారు. ఉపాధ్యాయ దంపతులు 13 జిల్లాల నుంచి తరలివచ్చి నిర్వహించిన ఆవేదన సభను చూసైనా ప్రభుత్వం స్పందించాలని, దంపతుల బదిలీలను వెంటనే చేపట్టాలని. రాష్ట్ర అధ్యక్షులు వివేక్ డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ కుటుంబాలు స్పౌజ్ బదిలీలు జరగకపోవడంతో అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం వారు పెద్ద మనసుతో ఈ సమస్య పరిష్కరించాలని అభ్యర్థించారు. ఒకటి రెండు క్యాడర్లు మినహా మిగతా అన్ని విభాగాల్లోనూ స్పౌజ్ బదిలీలు నిర్వహించడానికి …13 జిల్లాల్లో అవకాశం ఉందని సభ్యులు నరేష్ స్పష్టం చేశారు. ఉపాధ్యాయ దంపతుల సమస్యను సానుకూల దృక్పథంతో స్వీకరించి వెంటనే పరిష్కారం చూపించాలని అభ్యర్థించారు.
Mahesh Babu-SS Rajamouli: ఆర్‌ఆర్‌ఆర్‌ను మించి మహేశ్‌ బాబు సినిమా ఉంటుంది: విజయేంద్ర ప్రసాద్‌