Site icon NTV Telugu

Vikarabad school: ప్రభుత్వ పాఠశాలలో దారుణం.. విద్యార్థులతో బండరాళ్లను మోయిస్తున్న టీచర్లు

Vikarabad Government School

Vikarabad Government School

Vikarabad Government school: తెలంగాణ ప్రభుత్వం విద్యా రంగానికి పెద్దపీట వేస్తోంది. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు గురుకుల పాఠశాలలు, కస్తూర్బా విద్యాలయాలు, మోడల్ స్కూళ్లు పెద్దఎత్తున ఏర్పాటు చేస్తుంది. వీటితో పాటు కేజీ టు పీజీ విద్యాలయాలకు రూపకల్పన చేస్తున్నారు. మన ఊరు మన బడి పేరుతో అన్ని మౌలిక వసతులతో కూడిన సరైన పాఠశాల భవనాలను నిర్మిస్తూ ముందుకు సాగుతోంది. ఇవన్నీ సర్కార్ ప్రాతిపథకన పనులను చేస్తుంటే. క్షేత్రస్థాయిలో మాత్రం కొన్ని ప్రాంతాల్లో భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అందుకు నిదర్శనమే వికారబాద్‌ జిల్లా తాండూర్‌ ప్రభుత్వ నెంబర్‌ వన్‌ హైస్కూల్‌.

Read also: Jeevan Reddy: బీజేపీ, బీఆర్‌ఎస్‌ రెండు పార్టీలు దొంగలే

వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలోని ప్రభుత్వ నెంబర్ వన్ హైస్కూల్లో విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయులు వారితో బండరాళ్లను ఎత్తిస్తూ పనులకు పరిమితం చేస్తున్నారు. అభం సుభం తెలియని ఆపసిపిల్లలు చదువుకునేందుకు పాఠశాలకు వస్తే వారితో బండరాళ్లను ఎత్తిస్తూ పనులకు పరిమితం చేస్తున్నారు. చిన్న పిల్లలతో బరువైన బండ్లను ఎత్తించి ఒకచోట నుంచి మరొక చోటుకు విద్యార్థులకు ఆదేశాలు ఇచ్చి వారితో పనులను చేయించుకుంటున్నారు. పాఠశాల క్లాస్ రూమ్ దగ్గర ఉన్న బండ రాళ్లను విద్యార్థుల ఎత్తుకెళ్లి వేరేచోట పెట్టాలని విద్యార్థులకు ఆదేశాలు ఇచ్చిన టీచర్లు దీంతో విద్యార్థులు ఆ బండరాల్లను మోయలేని పరిస్థితిలో వున్నా టీచర్ల మాట వినకపోతే కొడతారేమో అని భావించి బండరాళ్లను మోసుకుంటూ తీసుకెళ్లిన వైనం కలకలం రేపుతుంది. ఈ నిర్వాకాన్ని చూసిన కొందరు ఎస్ఎఫ్ఐ నాయకుల ఫోన్ లో చిత్రీకరిస్తుంటే అక్కడే ఉన్న ఓ ఉపాధ్యాయుడు వారి ఫోన్‌ లాక్కునే ప్రయత్నం చేసి వారిపై దౌర్జన్యానికి దిగాడు. అయితే.. ఈవిషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు బడికి వెళ్లి విద్యాబుద్ధులు నేర్చుకుని తమకు ఆశరాగా వుండాల్సిన పిల్లలు ఇలా బండరాళ్లను మోస్తుంటే తల్లడిల్లుతున్నారు. మేము పనులకు వెళుతూ మా పిల్లలు బాగా చదువుకోవాలని స్కూళ్లకు పంపిస్తే ఇలా పిల్లలతో పనులు చేయించడం ఏంటని మండిపడుతున్నారు. వీరిపై అధికారులు దృష్టి సారించాలని కోరుతున్నారు.
IPL 2023: చెన్నై సూపర్ కింగ్స్ పెద్ద స్కెచ్.. ఇంపాక్ట్ ప్లేయర్ గా ధోనీ..

Exit mobile version