NTV Telugu Site icon

TDP Polit Bureau Meeting: నేడే ఎన్టీఆర్‌‌‌‌‌‌‌‌ భవన్‌‌‌‌‌‌‌‌లో టీడీపీ పొలిట్ బ్యూరో మీటింగ్‌.. తెలుగు రాష్ట్రాల అంశాలపై చర్చ

Chandrababu

Chandrababu

TDP Polit Bureau meeting today: నేడు ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌ వేదికగా పొలిట్ బ్యూరో సమావేశం ప్రారంభంకానుంది. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అధ్యక్షతన ఉదయం 10.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశానికి తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం 32 మంది సభ్యులు హాజరుకానున్నారు. తెలంగాణకు సంబంధించిన నాలుగు అంశాలు.. 1. అకాల వర్షాలు, పంట నష్టం – కష్టాల్లో రైతాంగం, 2. రాష్ట్రంలో నెరవేరని ప్రభుత్వ హామీలు, 3. ఇంటింటికీ తెలుగుదేశం, సభ్యత్వ నమోదు కార్యక్రమాల సమీక్ష, 4. పార్టీ సంస్థాగత బలోపేతం, సభ్యత్వ నమోదు, సాధికార సారధులు పై చర్చించనున్నారు, ఇక తెలంగాణ కు సంబంధించిన సుమారు 13 అంశాలు కురిసిన అకాల వర్షాలకు, వడగండ్ల వానలతో రైతులు నష్టపోవడం, పరిహారం, హామీలు అమలులో అనే పలు విషయాలపై చర్చించనున్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత విజయోత్సాహంతో ఉన్న పార్టీ వర్గాల్లో మరింత ఉత్సాహం నింపటం సహా ఏపీ తెలంగాణలో రాజకీయ అంశాలతో పాటు ఉమ్మడిగా రెండు తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ శ్రేణులపై జరుగుతున్న దాడులు, ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాల నిర్వహణ, పార్టీ 42వ ఆరిర్భావ దినోత్సవాన్ని ప్రత్యేకంగా నిర్వహించనున్నట్లు తెలుస్తుంది. ఈ ఏడాది మే నెలలో ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాలు ముగియున్న నేపథ్యంలో ఉత్సవాలను మరింత వైభవంగా ఎన్టీఆర్‌ కీర్తిని చాటేలా నిర్వహించేందుకు కార్యాచరణను చంద్రబాబు దిశానిర్దేశంచనున్నట్లు సమాచారం. ట్రస్ట్‌ భవన్‌లో జరగనున్న ఈపొలిట్‌ బ్యూరో సమావేశం పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపనుంది. పార్టీని ప్రజలకు మరింత చేరువచేస్తుందని టీడీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు.

Read also: ‘Black’ Protest: బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాల ఐక్యపోరాటం

ఈనెల 29న (రేపు) టీడీపీ 41వ ఆవిర్భావ దినోత్సవ సభను నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో నిర్వహించేందుకు భారీ ఏర్పట్లు చేశారు. సభకు వచ్చే వారికి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేశామని, తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం ఖాయమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ ధీమా వ్యక్తం చేశారు. అంతేకాకుండా.. రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంతో పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం వచ్చిందన్నారు. ఇవాల నిర్వహించబోయే పొలిట్‌బ్యూరో సమావేశం.. రేపు (బుధవారం) జరిపే ఆవిర్భావ దినోత్సవ వేడుకలతో మరింత జోష్‌ వస్తుందన్నారు. రేపు నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో జరిగే ప్రతినిధుల సభకు ఏపీ, తెలంగాణతో పాటు అండమాన్‌ నుంచి కూడా మొత్తం 15 వేల మంది ప్రతినిధులు హాజరవుతున్నారని తెలిపారు. ఈసభను విజయవంతం చేసేందుకు 11 కమిటీలను ఏర్పాటు చేశామని వెల్లడించారు.