Site icon NTV Telugu

Tammineni Veerabhadram: ఛార్జీల బాదుడుపై ఉద్యమిస్తాం

వరుసగా పెరుగుతున్న నిత్యావసరాలు, పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ సిలిండర్ల బాదుడుతో సామాన్యులు నానా అవస్థలు పడుతున్నారు. తెలంగాణలో ఆర్టీసీ, విద్యుత్ చార్జీలు విపరీతంగా పెంచారు. చంద్రబాబు హయాంలో ఛార్జీల పెంపుపై పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది. చంద్రబాబు అధికారం కోల్పోయారు. ఇపుడు ధరలు తగ్గించక పోతే, ఆందోళనలు చేస్తాం అన్నారు సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం.

వరి కొనుగోలు విషయంలో కేంద్ర, రాష్ట్రాలు బాధ్యత తీసుకోవాలన్నారు. కేసీఆర్ బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడడాన్ని స్వాగతిస్తున్నాం. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేసీఆర్ చేస్తున్న పోరాటానికి మా మద్దతు ఉంటుందన్నారు. బీజేపీ, టీఆర్‌ఎస్ తగాదాలా కాకుండా అందరిని కలుపుకుపోవాలన్నారు వీరభద్రం. అఖిలపక్షంను పిలిచి అభిప్రాయాలు సేకరించి వారితో కలిసి పోరాటం చేయాలన్నారు. రాజకీయాలను, కేంద్ర రాష్ట్ర సంబంధాలను మిలితం చెయ్యవద్దన్నారు. ఎన్నికల ముందు ఫ్రoట్ లు సక్సెస్ కాలేదని అభిప్రాయపడ్డారు వీరభద్రం. రాష్ట్ర సమస్యలపై పోరాడాలి. కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చెయ్యాలన్నారు.

https://ntvtelugu.com/medicine-prices-will-increased-from-april-month/
Exit mobile version