NTV Telugu Site icon

Annamalai: కాంగ్రెస్ కు రామమందిరాన్ని తాకే హక్కు కూడా లేదు..

Annamalai

Annamalai

Annamalai: కాంగ్రెస్ కు రామమందిరాన్ని తాకే హక్కు కూడా లేదని తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై సంచలన వ్యాఖ్యలు చేశారు. సంగారెడ్డిలో రోడ్ షోలో అన్నామలై పాల్గొన్నారు. తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలో రావడం ఖాయమన్నారు. ఇండియా కూటమిలో ప్రధాని అభ్యర్థిపై గొడవలు జరుగుతున్నాయన్నారు. కాంగ్రెస్ కు రామమందిరాన్ని తాకే హక్కు కూడా లేదన్నారు. మేము రక్తం చిందించి తెచ్చిన అన్ని చట్టాలను కాంగ్రెస్ వస్తె రద్దు చేస్తుందన్నారు. బీజేపీ మతాలకు అతీతంగా పని చేస్తుందన్నారు. ఒక ముస్లింను రాష్ట్రపతి, దళితులను, ఆదివాసీ మహిళని రాష్ట్రపతి చేసిన ఘనత బీజేపీ ది అన్నారు.

Read also: Thug Life : స్టన్నింగ్ అప్డేట్ ఇచ్చిన థగ్ లైఫ్ టీం.. వీడియో వైరల్..

కరీంనగర్ ఎంపీ, బీజేపీ జాతీయ కార్యదర్శి బండి సంజయ్ తరఫున నిన్న అన్నామలై ప్రచారంలో పాల్గొన్నారు. జమ్మికుంటలో జరిగిన యువ సమ్మేళన కార్యక్రమంలో తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు అన్నామలై, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అన్నామలై మాట్లాడుతూ.. మోడీ గుండెలో బండి సంజయ్ కి ప్రత్యేక స్థానం ఉందన్నారు. సౌతిండియాలో బీజేపీని బలోపేతం చేసేందుకు బండి సంజయ్ కు జాతీయ పదవిచ్చారని తెలిపారు. యూత్ ఐకాన్… సంజయ్ అని కొనియాడారు. బండి సంజయ్ స్పూర్తితోనే తాను తమిళనాడులో పాదయాత్ర చేసినట్లు అన్నామలై తెలిపారు. ఈ ఎన్నికల్లో 60 శాతం ఓట్లతో సంజయ్ ను గెలిపించండని.. బండి సంజయ్ గెలిస్తే సామాన్యుడు గెలిచినట్లేనని అన్నామలై పేర్కొన్నారు.
Pm Modi: దేశానికి వ్యతిరేకంగా మాట్లాడటంలో కాంగ్రెస్ నేతలు పోటీ పడుతున్నారు