NTV Telugu Site icon

Talasani Srinivas Yadav: మేము కమిట్మెంట్‌తో పని చేస్తుంటే.. బీజేపీ కుట్రలు చేస్తుంది

Talasani On Paper Leak

Talasani On Paper Leak

Talasani Srinivas Yadav Pressmeet On TSPSC Paper Leak: టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీకేజ్ వ్యవహారంపై తాజాగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. రాజ్ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. స్వాతంత్రం వచ్చాక దేశంలో రిక్రూట్మెంట్ విషయంలో తూతూ మంత్రంగా పనిచేశారని అన్నారు. తాము టీఎస్‌పీఎస్‌సీ ద్వారా పారదర్శకంగా ఉద్యోగాలు భర్తీ చేసుకుంటూ వెళ్తున్నామన్నారు. సీఎం కేసీఆర్ అన్ని ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు పూరి చేస్తామని హామీ ఇచ్చారని, ఆయన చెప్పినట్లుగానే ఖాళీగా ఉన్న ఉద్యోగాల్ని భర్త చేస్తున్నారని పేర్కొన్నారు. యూపీఎస్‌సీ చైర్మన్ కూడా వచ్చి టీఎస్‌పీఎస్‌సీ మీద అధ్యయనం చేశారని, అందులోని విధానాల్ని పరిశీలించిన అభినందనలు తెలియజేశారని గుర్తు చేశారు. 13 రాష్ట్రాల సర్వీస్ కమిషన్లు కూడా అధ్యయనం చేసి, అభినందనలు తెలిపాయన్నారు. ఉద్యోగాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కమిట్మెంట్‌తో పని చేస్తోందని చెప్పారు.

TSPSC Paper Leak: టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీకేజీలో కీలక మలుపు

ఈ పేపర్ లీకేజ్ వ్యవహారంలో ఏ2 నిందితుడైన రాజశేఖర్ రెడ్డి ఒక బీజేపీ కార్యకర్త అని మంత్రి తలసాని తెలిపారు. ఈ వ్యవహారమంతా కుట్రతోనే జరిగిందని అనుమానం వ్యక్తం చేశారు. సిట్ ఈ వ్యవహారంలో డీటెయిల్డ్‌గా విచారణ జరిపి, దోషులను కఠినంగా శిక్షించాలని విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. యువత ఉద్యోగాల కోసం పోటీ పడితే.. బీజేపీ వాళ్లు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రవీణ్ అర్హత సాధించలేదు కానీ.. బండి సంజయ్ బిజెపి వాళ్ళు అర్హత సాధించినట్టు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వరుస నోటిఫికేషన్లతో యువత తమకు దూరం అవుతున్నారని అనేక మీటింగ్స్‌లో బండి సంజయ్ చెప్పాడన్నారు. ఆయన దుర్మారాగమైన ఆలోచనలు యువతకు శాపంగా మారాయని విమర్శించారు. మధ్యప్రదేశ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్‌లో ఎన్నో ఆరోపణలు వచ్చాయని.. కానీ తెలంగాణాలో ఇప్పటివరకు నియామకాల్లో ఎలాంటి ఆరోపణలు రాలేదని తెలియజేశారు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని మోడీ హామీ ఇచ్చారని.. ఆ లెక్కన ఇప్పటివరకు 16 కోట్ల ఉద్యోగాలు రావాలని.. కానీ ఒక్కటి కూడా రాలేదని దుయ్యబట్టారు.

Amma Pregnant : అమ్మ ప్రెగ్నెంట్.. 23ఏళ్ల యువతికి తండ్రి శుభవార్త

ఉద్యోగాల విషయంలో వైట్ పేపర్ రిలీజ్ చేస్తారా? అని మంత్రి తలసాని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఉద్యోగాల మేం ఏం చేశామో, మీరేం చేశారో ప్రజలకు అన్ని తెలుసని తేల్చిచెప్పారు. యువతల జీవితాలతో ఆడుకోవడం దుర్మార్గమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. TSPSC బోర్డ్ తీసేస్తారా? అది పబ్లిక ప్రాపర్టీ, ఇష్టమొచ్చినట్టు చేస్తారా? అని ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ పేపర్ లీకేజ్ వ్యవహారంలో ప్రభుత్వం సీరియస్ యాక్షన్ తీసుకుంటుందని హెచ్చరించారు. ఎనిమిదేళ్లలో టీఎస్‌పీఎస్‌సీకి ఒక్క రిమార్కు కూడా రాలేదన్నారు. ఇందులో ఎవరున్నా వదిలే ప్రసక్తే లేదన్నారు. పిల్లల భవిష్యత్ కోసం ఎంత ఖర్చు అయినా వెనుకాడకుండా.. నోటిఫికేషన్లు ఇస్తున్నామన్నారు. యువత జీవితాలతో అడుకోవద్దని సూచించారు.

Show comments