Site icon NTV Telugu

Talasani Srinivas Yadav : పాఠశాలలు అన్నివిధాలా అభివృద్ధి చేస్తాం..

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను పెంపొందించే ప్రయత్నంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మన బస్తీ-మన బడి’కి అన్ని విధాలా సహకారం అందిస్తుందని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. పశుసంవర్ధకశాఖ కార్యాలయంలో ‘మన బస్తీ– మన బడి’పై హోం మంత్రి మహమూద్‌ అలీ, ఎమ్మెల్యేలతో కలిసి మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇందుకోసం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు రూ.7,289.54 కోట్లు కేటాయించాని ఆయన వెల్లడించారు.

హైదరాబాద్ జిల్లాలో 508 ప్రాథమిక పాఠశాలలు మరియు 182 ఉన్నత పాఠశాలలు ఉన్నాయని ఆయన అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ల కోసం పోటీపడే స్థాయికి తీసుకొస్తామని, ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న అనేక సమస్యలను రాబోయే రెండేళ్లలో పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. త్వరగా సమస్యలను పరిష్కరించాలని, ఇంగ్లీష్‌ మీడియంపై దృష్టి సారించాలని అధికారులను ఆయన ఆదేశించారు. ప్రజాప్రతినిధులు ఆయా పాఠశాలలను సందర్శిస్తూ సమస్యలను తెలుసుకోవాలన్నారు.

https://ntvtelugu.com/harish-rao-lettar-to-union-minister-nirmalasitaraman/
Exit mobile version