NTV Telugu Site icon

JNTU: జేఎన్‌టీయూ హైదరాబాద్ వీసీగా టీ కిష‌న్ కుమార్ రెడ్డి నియామ‌కం

Hyderabad

Hyderabad

తెలంగాణ ప్రభుత్వం జేఎన్‌టీయూ హైదరాబాద్ యూనివర్సిటీకి వీసీని నియమించింది. వైస్ ఛాన్సలర్ గా టీ కిష‌న్ కుమార్ రెడ్డిని నియమించింది. వీసీ నియామకానికి సంబంధించిన ఫైల్ పై రాష్ట్ర గ‌వ‌ర్నర్ జిష్ణుదేవ్ వ‌ర్మ సంతకం చేయడంతో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జేఎన్‌టీయూ వీసీగా కిష‌న్ కుమార్ రెడ్డి.. ప‌ద‌వీ బాధ్యతలు స్వీక‌రించిన నాటి నుంచి మూడేళ్ల పాటు ఆ ప‌ద‌విలో కొన‌సాగ‌నున్నారు. గతేడాది మే 21న ఖాళీ అయిన వర్సిటీ వీసీ పోస్టును భర్తీ చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నించినా సాంకేతిక కారణాల రీత్యా నియామక ప్రక్రియ వాయిదా పడింది. తాజాగా జేఎన్‌టీయూ హైదరాబాద్ యూనివర్సిటీకి పూర్తిస్థాయి వీసీని ప్రభుత్వం నియ‌మిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మరో వైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రం లో పలు యూనివర్సిటీలకు ప్రస్తుతం ఉన్న ఇంచార్జ్ వైస్ ఛాన్సలర్ ల స్థానంలో రెగ్యులర్ వీసీలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.