NTV Telugu Site icon

గాంధీభవన్‌లో పీఏసీ భేటీ.. కోమటిరెడ్డి, జగ్గారెడ్డి డుమ్మా..

హుజురాబాద్‌ ఉప ఎన్నికల ఫలితాలు బీజేపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపితే.. టీఆర్ఎస్‌ పోరాడా ఓడింది.. కానీ, కాంగ్రెస్‌ మాత్రం ఏ మాత్రం ప్రభావాన్ని చూపలేకపోయింది.. దీంతో.. బీజేపీ-కాంగ్రెస్‌ కుమ్మక్కు అయ్యాయని ఆరోపిస్తుంది అధికార పక్షం.. దానికి తోడు.. కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం.. పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డిని టార్గెట్‌ చేస్తూ విమర్శలు గుప్పించడం రచ్చగా మారింది. అయితే, హుజురాబాద్‌లో పార్టీ ఘోర పరాజయంతో పాటు.. పీసీసీని టార్గెట్‌ చేస్తూ.. నేతలను చేసిన ఆరోపణలపై కూడా చర్చించేందుకు సిద్ధమైంది కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ.. దీని కోసం గాంధీ భవన్‌లో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్‌ మాణిక్కం ఠాగూర్‌.. ఈ భేటీకి పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి, జానారెడ్డి, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, షబ్బీర్‌ అలీ, బోస్‌రాజు, శ్రీధర్‌బాబుతో పాటు హుజురాబాద్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి వెంకట్‌ కూడా హాజరయ్యారు.. అయితే, పార్టీని టార్గెట్‌ చేసి విమర్శలు చేసిన ఆ ఇద్దరు నేతలు మాత్రం హాజరుకాలేదు.. ఇవాళే తేల్చేస్తామన్న జగ్గారెడ్డి కానీ.. ఎంపీ కోమటిరెడ్డి కానీ.. ఈ భేటీకి హాజరుకాకుండా డుమ్మా కొట్టడం చర్చగామారింది.