T.Congress leaders to besiege BRS Bhavan in Delhi: ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నిరసనలకు పిలుపు ఉత్కంఠంగా మారింది. తెలంగాణ సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని అందిన ఫిర్యాదుల మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు కాంగ్రెస్ వార్ రూమ్ కార్యాలయాన్ని సీజ్ చేశారు. దీంతో కాంగ్రెస్ వార్ రూమ్ సీజ్ చేయడాన్ని సీరియస్ గా తీసుకుంది ఏఐసీసీ. పార్లమెంట్ లో మనిక్కమ్ ఠాగూర్ వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు. హైదరాబాద్‌లోని తెలంగాణ కాంగ్రెస్ వార్ రూమ్‌లోకి ప్రవేశించి ఐదుగురిని అరెస్టు చేసిన తెలంగాణ పోలీసుల దౌర్జన్య వైఖరిపై చర్చించాలని కోరారు. కేసీఆర్ దక్షిణ భారత హిట్లర్‌గా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అయితే.. కాంగ్రెస్ వార్ రూమ్ కార్యాలయాన్ని సీజ్ చేయడంతో ఏఐసీసీ సీరియస్ గా తీసుకుంది. ఇవాళ టీపీసీసీ అధ్యక్షులు ఎంపీ రేవంత్ రెడ్డి, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్య నాయకులు ఢిల్లీలోని తెలంగాణ భవన్ కు వెళ్లనున్నారు. అక్కడ నిరసన వ్యక్తం చేసేందుకు కాంగ్రెస్ ఎంపీలు, నాయకులు సిద్దమయ్యారు. తెలంగాణ భవన వద్ద మీడియాతో ఎంపీ.లు రేవంత్ రెడ్డి, ఉత్తమ్.కుమార్ రెడ్డి మాట్లాడనున్నారు. ఢిల్లీలో బీఆర్ఎస్ భవన్ ను తెలంగాణ కాంగ్రెస్ నాయకులు, ఎంపీలు ముట్టడించనున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, పోస్టర్ల ప్రదర్శన వెలశాయి. సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మల దగ్ధం చేశారు నిరసనకారులు. దీంతో పోలీసులు నాయకులను గృహ నిర్బందాలు చేస్తున్నారు.
Read also: West Bengal: బీర్భూమ్ హింసాకాండ నిందితుడి ఆత్మహత్య.. సీబీఐ అధికారులపై మర్డర్ కేసు..
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నేతలను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ స్ట్రాటజీ టీమ్ హెడ్ సునీల్ కానుగులు కార్యాలయాన్ని (కాంగ్రెస్ వార్ రూమ్) సైబర్ క్రైమ్ పోలీసులు మంగళవారం రాత్రి సీజ్ చేశారు. అంతేకాదు ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు నిరసనగా నేడు రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నిరసనలకు పిలుపునిచ్చింది. తెలంగాణ సీఎం కేసీఆర్‌పై సోషల్ మీడియాలో వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా సైబర్ క్రైమ్ పోలీసులు ఈ కార్యాలయాన్ని సీజ్ చేశారు. నిన్న రాత్రి సునీల్ కార్యాలయాన్ని సీజ్ చేసేందుకు వచ్చిన సైబర్ క్రైమ్ పోలీసులతో కాంగ్రెస్ నేతలు వాగ్వాదానికి దిగారు. సైబర్ క్రైమ్ పోలీసులతో మాజీ ఎంపీ మల్లు రవి, మాజీ మంత్రి షబ్బీర్ అలీ వాగ్వాదానికి దిగారు.
కాంగ్రెస్ పార్టీ వార్ రూమ్‌ను సైబర్ క్రైమ్ పోలీసులు సీజ్ చేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ నిరసనలకు పిలుపునిచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేయాలని కోరారు.వార్‌రూమ్‌ను పోలీసులు సీజ్ చేయడంపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆందోళనకు దిగే అవకాశం ఉండటంతో కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన షబ్బీర్ అలీ, మల్లు రవి, సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, వి.హనుమంతరావు, యూత్ కాంగ్రెస్ నాయకులు అనిల్ యాదవ్ సహా పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి హౌస్ అరెస్ట్ చేశారు.
Andhra Pradesh: ప్రభుత్వానికి ఉద్యోగుల హెచ్చరిక.. సంక్రాంతి తర్వాత ప్రత్యక్ష ఆందోళనలు
